iDreamPost
android-app
ios-app

సోనాక్షి పెళ్లి విషయం మాకు తెలీదు.. తండ్రి షాకింగ్ కామెంట్స్!

  • Published Jun 11, 2024 | 3:29 PM Updated Updated Jun 11, 2024 | 3:29 PM

తన కూతురు సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోబోతుందన్న విషయం తనకు తెలీదని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

తన కూతురు సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోబోతుందన్న విషయం తనకు తెలీదని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

  • Published Jun 11, 2024 | 3:29 PMUpdated Jun 11, 2024 | 3:29 PM
సోనాక్షి పెళ్లి విషయం మాకు తెలీదు.. తండ్రి షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. తన ప్రియుడు , నటుడు జహీర్ ఇక్బాల్ తో ఈనెల 23న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఇక ముంబైలో ఘనంగా జరగనున్న వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు అవుతారని తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సోనాక్షి పెళ్లి నేపథ్యంలో ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తన కూతురి పెళ్లి గురించి ఇప్పటి వరకు తనకు సమాచారం లేదని ఆయన తెలిపారు.

సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ ఈనెల 23న పెళ్లిచేసుకొబోతున్నారు. ముంబైలో జరిగే ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరౌతారని తెలుస్తోంది. ఈ క్రమంలో తన కూతురు పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు శత్రుఘ్న సిన్హా. సోనాక్షి పెళ్లి చేసుకోబోతుందన్న విషయం తనకు తెలీదని, మీలాగే నేను కూడా మీడియాలో చూసే తెలుసుకున్నానని చెప్పి.. అందరిని ఆశ్చర్యపరిచారు. సోనాక్షి వివాహంపై శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ..

“నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. నా కూతురు పెళ్లి గురించి నాకేం తెలీదు. అదీకాక సోనాక్షి పెళ్లి గురించి నాతో ఏం చెప్పలేదు. నేను కూడా మీలాగే మీడియాలో చదివే ఈ వార్త గురించి తెలుసుకున్నాను. తన వివాహం గురించి మాకు చెబితే.. నేను, నా భార్య మా ఆశీస్సులు అందిస్తాం. తన పెళ్లికి మేము వ్యతిరేకం కాదు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాం. పైగా స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు వారికి ఉంది. చాలా మంది ఈరోజుల్లో పెళ్లికి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ విషయం తెలిసి.. అందరు షాక్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. గత కొంత కాలంగా సోనాక్షి-ఇక్బాల్ డేటింగ్ లో ఉన్నారు. తమ రిలేషన్ షిప్ గురించి ఎప్పటికప్పుడు పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు. 2022లో వచ్చిన డబుల్ ఎక్స్ ఎల్ మూవీలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం పెరిగి.. ప్రేమకు దారితీసి.. చివరికి పెళ్లి వరకు వచ్చింది. మరి కూతురు పెళ్లి గురించి తండ్రికి తెలీకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabet