iDreamPost
android-app
ios-app

Movie: తెలుగులో రజినీకాంత్‌ కు అవమానం! పరువు తీసిన కూతురు!

  • Published Feb 12, 2024 | 1:16 PM Updated Updated Feb 12, 2024 | 1:16 PM

ఇటీవలే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు. అయితే ఈ సినిమాను ఉద్దేశించి ఐశ్వర్య పై నెటిజన్స్ భారీ స్థాయిలో విమర్శిస్తున్నారు. ఎందుకంటే..

ఇటీవలే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు. అయితే ఈ సినిమాను ఉద్దేశించి ఐశ్వర్య పై నెటిజన్స్ భారీ స్థాయిలో విమర్శిస్తున్నారు. ఎందుకంటే..

  • Published Feb 12, 2024 | 1:16 PMUpdated Feb 12, 2024 | 1:16 PM
Movie: తెలుగులో రజినీకాంత్‌ కు అవమానం! పరువు తీసిన కూతురు!

సూపర్ స్టార్ రజీనీకాంత్ గతేడాది ‘జైలర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలసిందే. కాగా, ఈ సినిమాలో తన మాస్ లుక్, యాక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రజనీ. ఇక ఈ సినిమా తర్వాత.. రజనీకాంత్ లెటెస్ట్ గా నటించిన మూవీ ‘లాల్ సలామ్’. పైగా ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించడంతో.. ప్రేక్షకుల్లో ఈ సినిమా పై మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్రలో నటించగా.. హీరో విష్ణు విశాల్, విక్రాంత్ కూడా నటించారు. దీంతో భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 9న థీయేటర్లలో విడుదలైంది. కానీ, ఆశించిన స్థాయిలో ‘లాల్ సలామ్’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కూతురు మీద ప్రేమతో కాదనలేక ఈ సినిమా చేసినందుకు.. రజనీకాంత్ ఇమేజ్ కు భారీ దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ సినిమా అటూ తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఘోరా పరాజయం పొందింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు. అయితే.. ఈ సినిమా రోటిన్ స్టోరి కావడంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. అలాగే.. ఈసినిమాకు ఫస్ట్ డే నే చూసే వాళ్లు లేకపోవడంతో.. భారీగా స్క్రీన్స్ తగ్గించేశారు. ఈ క్రమంలోనే.. కొన్ని చోట్ల అయితే ఏకంగా షోలనే క్యాన్సిల్ చేసి డబ్బులను ప్రేక్షకులకు రిటర్న్ ఇచ్చేశారు. అసలు రజనీకాంత్ సినిమాలంటే.. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈయన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆయన యాక్షన్, స్టైల్ ను ఇష్టపడని వారంటూ ఉండరు. ఇక కోలీవుడ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అంతలా క్రేజ్ ఉన్న ఈ హీరో సినిమాకు.. తెలుగు రాష్ట్రాల్లో కనీసం చూసే వాళ్లు లేకుండా పోయారు. దీంతో లాల్ సలామ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైందని, అలాగే శత్రవులు ఎక్కడో ఉండరని.. కూతుళ్ల రూపంలో ఉంటారని నెటిజన్స్ వ్యగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే జైలర్ సినిమాతో రజనీకాంత్ కు వచ్చిన క్రేజ్ మొత్తం లాల్ సలామ్ తో పోయిందని, రజనీకాంత్ పరువును ఆయన కూతురు తీసేసిందని విమర్శిస్తున్నారు.

ఇక లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్ పాత్ర 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇందులో ఆయన ‘మొయిదీన్ భాయ్’ అనే పాత్రలో కనిపిస్తారు. అయితే సినిమాలో రజనీ ఉన్నంత వరకు సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. కానీ, ఆ తర్వాత మాత్రం అంతగా చూడటానికి ఆసక్తిగా ఉండదు. పైగా ఈ సినిమా మత కాన్సెప్ట్ కు సంబంధించినది, రోటీన్ స్టోరి కావడంతో దీనికి అంతగా ఆదరణ దక్కలేదు. దీంతో ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. మరి, లాల్ సలామ్ సినిమాతో ఐశ్వర్య తన తండ్రి పరువు తీసేసిందనే విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.