iDreamPost
android-app
ios-app

ఆమె ఇద్దరు పిల్లల తల్లి అంటూ.. అభిమానిపై మండిపడ్డ షారుఖ్ ఖాన్!

  • Author Soma Sekhar Updated - 04:03 PM, Sat - 12 August 23
  • Author Soma Sekhar Updated - 04:03 PM, Sat - 12 August 23
ఆమె ఇద్దరు పిల్లల తల్లి అంటూ.. అభిమానిపై మండిపడ్డ షారుఖ్ ఖాన్!

సెలబ్రిటీలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అభిమానులతో ముచ్చటించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా వారు అభిమానులతో టచ్ లో ఉంటూ ఉంటారు. ఇక కొంత మంది హీరోలు, హీరోయిన్ లు తమ అభిమానులతో మాటా ముచ్చట.. అదేనండి ఆస్క్ మీ పేరుతో చిట్ చాట్ సెషన్ నిర్వహిస్తారు. ఈ చిట్ చాట్ లో ఫ్యాన్స్ నుంచి కొన్ని అభ్యంతరకరమైన ప్రశ్నలు కూడా ఎదురౌతూ ఉంటాయి. తాజాగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ AskSRK పేరుతో చాట్ నిర్వహించాడు. ఈ సెషన్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చాడు. అయితే ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. నోరు మూసుకో అంటూ అతడిపై ఫైర్ అయ్యాడు. అసలు ఇంతకి ఏం జరిగిందంటే?

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చాలా సంవత్సరాల తర్వాత పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రూ. వెయ్యి కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపింది. దీంతో షారుఖ్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ‘జవాన్’ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సౌత్ డైరెక్టర్ అట్లీ. దీంతో సౌత్ లో కూడా ఈ మూవీకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది.

కాగా.. జవాన్ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది. దీంతో ప్రమోషన్స్ మెుదలు పెట్టింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే షారుఖ్ తాజాగా అభిమానులతో AskSRK పేరుతో చాట్ నిర్వహించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదా సరదాగా ఆన్సర్స్ ఇచ్చాడు కింగ్ ఖాన్. జవాన్ మూవీలో మెసేజ్ ఉంటుందా? అని ఓ ఫ్యాన్ ప్రశ్నించగా.. ఇది మహిళా సాధికారత గురించి చెప్పే చిత్రం, వారిని ఎలా గౌరవించాలి, ఎలా ప్రోత్సహించాలి అనేది ఇందులో ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.

ఇక ఇందులో మీ రొమాంటిక్ యాంగిల్ చూడొచ్చా అని మరో అభిమాని అడగ్గా.. ఒక్క వైపు ఏం కర్మ.. అన్ని వైపులా చూడొచ్చు అంటూ చమత్కరించాడు షారుఖ్. మరో అభిమాని కాస్త లోతుగా వెళ్లి.. మీరు నయనతారకి పడిపోయారా? ఆమెని ప్రేమిస్తున్నారా? అంటూ ప్రశ్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన షారుఖ్ ఫ్యాన్ పై ఫైర్ అయ్యాడు. నోరు మూసుకో.. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం షారుఖ్ ఇచ్చిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఫ్యాన్ ను షారుఖ్ ఇచ్చిన ఘాటు రిప్లైపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: బలగం సీన్‌ రిపీట్‌.. హీరో భార్య సమాధి దగ్గరకు కాకులు!

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis