iDreamPost
android-app
ios-app

వీడియో: ముత్యాల ముగ్గు సీరియల్ నటి సీమంతం వేడుకలు..

  • Published May 02, 2024 | 10:14 PM Updated Updated May 02, 2024 | 10:14 PM

ఇటీవల ప్రముఖ సీరియల్ నటి మహేశ్వరి సీమంతం వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మరో సీరియల్ నటికి కుటుంబ సభ్యులు ఘనంగా సీమంతం వేడుకలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల ప్రముఖ సీరియల్ నటి మహేశ్వరి సీమంతం వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మరో సీరియల్ నటికి కుటుంబ సభ్యులు ఘనంగా సీమంతం వేడుకలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published May 02, 2024 | 10:14 PMUpdated May 02, 2024 | 10:14 PM
వీడియో: ముత్యాల ముగ్గు సీరియల్ నటి సీమంతం వేడుకలు..

సినిమా ఆర్టిస్టులకే కాదు. సీరియల్ ఆర్టిస్టులకు  కూడా ఫ్యాన్ బేస్ బానే ఉంటుంది. ఇంకా సినిమా హీరోలు, హీరోయిన్లు సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే దర్శనమిస్తారు. కానీ ఈ సీరియల్ నటులు రోజూ దర్శనమిస్తుంటారు. ఈ కారణంగా సీరియల్ నటులు, నటీమణులు ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అయిపోతారు. వాళ్ళు చేసే పాత్రలను బాగా గుర్తుపెట్టుకుంటారు. ఒక్క సీరియల్ తో ఫేమ్ వస్తే చాలు.. లైఫ్ లాంగ్ సీరియల్స్ లో చేసిన వాళ్ళని ఎక్కడికెళ్లినా గుర్తిస్తారు. నటులు, నటీమణులు కూడా ఒక పక్క సీరియల్స్ లో నటిస్తూ.. సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటున్నారు.

రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. ఇటీవల సీరియల్ నటి మహేశ్వరి సీమంతం వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోని ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో అలానే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ తర్వాత ఆమెకు బాబు కూడా పుట్టాడు. ఆ వీడియోని సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. తాజాగా మరో సీరియల్ నటి సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ముత్యాల ముగ్గు సీరియల్ లో కొండమ్మ పాత్రలో కామెడీ పండించిన స్వప్న గురించి తెలిసే ఉంటుంది. తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకులకు కితకితలు పెట్టించారు. ఈ సీరియల్ లో ఆమె నటనకు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే పడ్డాయి.  

ముత్యాల ముగ్గు సీరియల్ ద్వారా కొండమ్మ పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన స్వప్న.. మనసిచ్చి చూడు, ముత్యమంత ముగ్గు వంటి సీరియల్స్ లో నటించారు. ఆ సీరియల్స్ లో కూడా తనదైన మార్కుని చూపించారు. ప్రస్తుతం ఊహలు గుసగుసలాడే సీరియల్ లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం స్వప్న గర్భిణీ. 2022లో ఆమెకు వివాహం జరిగింది. త్వరలో ఆమె తల్లి కాబోతున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆమెకు సీమంతం చేశారు. అంగరంగ వైభవంగా సీమంతం వేడుకలు జరిగాయి. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Swapnakondamma Varakavi (@bujjivarakavi)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş