iDreamPost
android-app
ios-app

సీరియల్ నటి అరెస్ట్! వృద్ధుడిని ఇంటికి పిలిచి మరీ..

  • Author ajaykrishna Published - 01:21 PM, Sat - 29 July 23
  • Author ajaykrishna Published - 01:21 PM, Sat - 29 July 23
సీరియల్ నటి అరెస్ట్! వృద్ధుడిని ఇంటికి పిలిచి మరీ..

సామాన్య జనాలు సెలబ్రిటీలనే కాదు.. అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా సామాన్యులను ముంచే ప్రయత్నం చేస్తుంటారు. అలా తాజాగా ఓ సీరియల్ నటి.. ఓ వృద్ధుడిని ఇంటికి పిలిచి మరీ ఘనకార్యం చేసింది. చివరికి జైలు పాలైంది. ఈ ఘటన ప్రస్తుతం అటు సీరియల్ ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగింది? ఆ నటి ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే.. నిత్య శశి అనే సీరియల్ నటి మలయాళం సీరియల్స్ లో నటిస్తుంటుంది. చాలా పాపులర్ సీరియల్స్ లో నటించి.. నటిగా మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంది. కేరళలో పాతనమిట్ట అనే ప్రాంతంలో నిత్య నివాసం ఉంటుంది. ఈజీ మనీ కోసం అడ్డదారిలో అడుగేసి ఆఖరికి పోలీసుల చేతిలో అరెస్ట్ కి గురైంది.

ఈజీ మనీ కోసం సీరియల్ నటి నిత్య.. తన స్నేహితుడు బినుతో కలిసి.. తిరువనంతపురంకి చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగికి లక్షలలో టోకరా వేసే ప్రయత్నం చేసింది. ఆ పెద్దాయన వయసు 75 ఏళ్లు. తన స్నేహితుడు బినుతో కలిసి ఆ వృద్ధుడికి వలేసింది. ఇల్లు అద్దెకు కావాలనే నెపంతో మెల్లగా ఆ వృద్ధుడిని ముగ్గులోకి దింపి.. ఫోన్ కాల్స్ ద్వారా దగ్గరైంది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి.. ఓ రోజు కలకోటేలోని తన అద్దె ఇంటికి రావాలని ఆ వృద్ధుడిని ఆహ్వానించింది నిత్య. దీంతో ఆమెను నమ్మి వృద్ధుడు ఇంటికి వెళ్ళాడు. కట్ చేస్తే.. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది పోలీస్ కంప్లైంట్ లో వివరంగా పేర్కొన్నాడు బాధిత వృద్ధుడు.

ఇంతకీ ఆమె ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందంటే.. “ఇంటికి వెళ్లగానే నిత్య నన్ను మాయమాటల్లో పెట్టి.. నా దుస్తులు తొలగించి.. ఆపై ఆమె దుస్తులు తొలగించుకుంది. ఆ తర్వాత సడన్ గా ఆమె ఫ్రెండ్ బిను వచ్చి.. సీక్రెట్ గా మా ఇద్దరినీ ఫోటోలు తీసాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడు. తర్వాత తెలిసింది వారిద్దరూ ప్లాన్ తో చేశారని. ఇప్పటికి నా దగ్గర రూ. 11 లక్షలు తీసుకున్నారు. కానీ.. అంతటితో ఆగకుండా వారు మళ్లీ రూ. 25 లక్షలు డిమాండ్‌ చేశారు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పేసాను. అయినా మళ్లీ బెదిరింపులకు దిగారు.” అని తెలిపాడు. అనంతరం పోలీసుల సూచన మేరకు.. వృద్ధుడు రూ. 25 లక్షలు ఇస్తానని నిత్య, బినులకు కాల్ చేసి ఇంటికి రమ్మన్నాడు. అప్పటికే ప్లాన్ తో కాపు కాసి ఉన్న పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా నటి నిత్య, ఆమె ఫ్రెండ్ బినులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిని కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం ఈ ఘటన మలయాళం ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş