iDreamPost
android-app
ios-app

వీడియో: ఖరీదైన కారు కొన్న బుల్లితెర నటి.. ఎన్ని లక్షలంటే?

  • Published Jul 08, 2024 | 6:00 AM Updated Updated Jul 08, 2024 | 10:33 AM

ప్రముఖ బుల్లితెర ఫేమస్‌ హీరోయిన్‌ తాజాగా ఓ లగ్జారీ కారును కొనుగోలు చేసింది. ఇక ఆ కారు ధర తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. కాగా, ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

ప్రముఖ బుల్లితెర ఫేమస్‌ హీరోయిన్‌ తాజాగా ఓ లగ్జారీ కారును కొనుగోలు చేసింది. ఇక ఆ కారు ధర తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. కాగా, ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

  • Published Jul 08, 2024 | 6:00 AMUpdated Jul 08, 2024 | 10:33 AM
వీడియో: ఖరీదైన కారు కొన్న బుల్లితెర నటి.. ఎన్ని లక్షలంటే?

ఈ మధ్య కాలంలో వెండితెర నుంచి బుల్లితెర వరకు రోజు రోజుకీ కొత్త కార్ల కొనే సెలబ్రెటీల సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా మార్కెట్ లోకి ఏ కొత్త కార్లు వచ్చాయంటే చాలు వెంటనే వాటిని కొనుగోలు చేయాలని తెగ ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే.. లక్షల రూపాయాలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా.. కొనుగోలు చేసిన లగ్జరీ కార్ల ఫోటోలను, వీడియోలను చాలా ఉత్సహంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్‌ అనేది జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్ల కొనుగోలు విషయంలో హీరోల కన్నా హీరోయిన్లే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ బుల్లితెర హీరోయిన్‌ తాజాగా  మంచి లగ్జరీ కారును కొనుగోలు చేసింది. పైగా అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా, ప్రస్తుతం ఆ వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇంతకి ఆమె ఎవరంటే..

ఇప్పుడు సినిమా నటీనటులతో పోలిస్తే సీరియల్ యాక్టర్స్ ఎందులోనూ తక్కువ కాదని నిరుపించుకుంటున్నారు. పైగా వీరికి ప్రేక్షకుల్లో క్రేజ్‌ కూడా మామోలుగా ఉండదు. ముఖ్యంగా  ఓవైపు యాక్టింగ్ చేస్తూ మరోవైపు యూట్యూబ్, షోలు చేస్తూ ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నారు బుల్లితెర నటులు. ఈ క్రమంలోనే కొత్త ఇల్లు, కార్లు కొనేస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ గా నిలుస్తున్నారు. కాగా, ఇప్పటికే పలువురు సీరియల్ ముద్దుగుమ్మలు దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి. కాగా,  ఇప‍్పుడు ఆ లిస్టులోకి నటి ‘లహరి’ కూడా చేరింది. ఈమె గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఎందుకంటే.. ఈమె మొగలిరేకులు సీరియల్స్‌ లో నటించి మంచి క్రేజ్‌ ను సంపాదించుకుంది. దానితోపాటు గృహలక్ష‍్మి సీరియల్‌ లో కూడా నటించి ప్రేక్షకుల్లో తనదైన మార్క్‌ ను వేసుకుంది. అయితే ఇటీవలే ఈ అమ్మడు డిలవరీ అ‍య్యి ఒక మగ బిడ్డను కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం లహరి ఒకటో రెండో సీరియల్స్ చేస్తోంది. మరోవైపు యూట్యూబ్ ఛానెల్‌లోనూ వీడియోస్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా బెంబ్ ఈ-క్లాస్ కారు కొనుగోలు చేసింది. కాగా, ప్ర‍స్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలోనే పోస్ట్ చేసింది. ఇకపోతే ఆ కారు ధర మార్కెట్‌లో రూ.90 లక్షలకు పైనే ఉంది. ఎంత లేదన్నా అటు ఇటు కలిపి అన్ని  ఖర్చులతో కలిపి ఈ కారు రూ.కోటికి పైనే ఉండొచ్చు. అయితే కేవలం తెలుగు సీరియల్ నటి ఇంత లగ్జరీ కారు కొనడం అంటే మామూలు విషయం కాదు. ఇక లహరి షేర్‌ చేసిన కారు వీడియో పై పలువురు నెటిజన్స్‌, ఆమె ఫ్యాన్స్‌ స్పందిస్తూ ఆమెకు కంగ్రాస్‌ చెబుతున్నారు. మరి, లహరి కొనుగోలు చేసిన ఇంత లగ్జరీ కారు పై మీ అభిప్రాయాలు కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet