iDreamPost
android-app
ios-app

అసలు ఐశ్వర్య, శ్యామ్ గొడవ ఏంటి? ఎవరు కరెక్ట్? ఎవరు తప్పు?

  • Published Mar 13, 2024 | 4:15 PM Updated Updated Mar 13, 2024 | 7:56 PM

ఐశ్వర్య- శ్యామ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పెళ్లై ఆరు నెలలు కూడా పూర్తి కాకుండానే వీరి బంధం బీటలు వారింది. ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర మైన ఆరోపణలు చేసుకుంటున్నారు. వీరు చేసుకుంటున్న అలిగేషన్స్ ఏంటీ.. వారి కుటుంబ సభ్యుల ఏమంటున్నారంటే..?

ఐశ్వర్య- శ్యామ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పెళ్లై ఆరు నెలలు కూడా పూర్తి కాకుండానే వీరి బంధం బీటలు వారింది. ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర మైన ఆరోపణలు చేసుకుంటున్నారు. వీరు చేసుకుంటున్న అలిగేషన్స్ ఏంటీ.. వారి కుటుంబ సభ్యుల ఏమంటున్నారంటే..?

  • Published Mar 13, 2024 | 4:15 PMUpdated Mar 13, 2024 | 7:56 PM
అసలు ఐశ్వర్య, శ్యామ్ గొడవ ఏంటి? ఎవరు కరెక్ట్? ఎవరు తప్పు?

బుల్లితెర నటి ఐశ్వర్య అడ్డాలపై ఆమె భర్త శ్యామ్ కుమార్ పిన్నింటి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఓ మ్యాట్రీ మోనీ యాప్ ద్వారా ఈ సంబంధం రాగా, పెళ్లి చేసుకున్నామని, నెల రోజుల తర్వాత ఐశ్వర్య బండారం బయట పడిందని, గతంలోనే ఆమెకు పెళ్లి అయ్యిందని, మరొకరితో అక్రమ సంబంధం నెరుపుతుందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా రూ. 25 లక్షలు తీసుకుందని, ఐశ్వర్య వివాహేతర సంబంధం పెట్టుకున్న రియల్టర్ కరణం రమేష్ బాబు తనను బెదిరించాడని, కొన్ని ఆడియో క్లిప్ రిలీజ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా వార్త దావానంలా వ్యాపించింది. భర్త చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది ఐశ్వర్య. అతడు చేస్తున్న అలగేషన్స్.. నిరాధారమైనవని, అబద్దాలు అంటూ పేర్కొంది. ఇంతకు వీరి మధ్య గొడవ ఎలా మొదలైంది.. ఐశ్వర్య, శ్యామ్ కుటుంబ సభ్యులు చెబుతున్న వాస్తవాలేంటీ.. పూర్తి కథనం..

నటి ఐశ్వర్య ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. త్రిముఖి, నీ రూటే సెపరేట్, ఈ సినిమా సూపర్ హిట్ వంటి చిత్రాల్లో నటించింది. సినిమాల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. సీరియల్స్ చేస్తుంది. పలుకే బంగారమయేనా, అలా వైకుంఠపురం, అమ్మాయి గారు వంటి ధారావాహికల ద్వారా ఆమె చాలా ఫేమస్. కాగా, గత ఏడాది శ్యామ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె తనను మోసం చేసిందంటూ మీడియాకెక్కాడు శ్యామ్. అతడు చెబుతున్న వివరాల ప్రకారం..‘ కాపు మ్యాట్రి మోనీలో సంబంధం రాగా, గత ఏడాది సెప్టెంబర్ 6న విశాఖ పట్నంలో పెళ్లి జరిగింది. పెళ్లైన 15 రోజులకే హైదరాబాద్ వెళ్లగా..ఆమె మరొకరితో సన్నిహితంగా మెలగడం చూశాను, ఆమెకు గతంలో పెళ్లి అయ్యింది. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది’ అంటూ వాపోయాడు.

Who is right aishwarya or shyam

‘ఐశ్వర్యకు మందు, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉన్నాయి. హైదరాబాద్ వెళ్లాక నాకు ఈ విషయం తెలిసింది. అంతలో ఆమెతో రిలేషన్ షిప్ మెయిన్ టైన్ చేస్తున్న వ్యక్తి కూడా.. నాకు ఫోన్ చేసి బెదిరించాడు. విడాకులు ఇవ్వాలంటూ ఇద్దరూ టార్చర్ చేశారు. మేము పెళ్లికి పెట్టిన నగలు, రూ. 25 లక్షల క్యాష్ నా భార్య కాజేసింది’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సంచలనమైన ఆరోపణలు చేశాడు ఐశ్వర్య భర్త శ్యామ్. కాగా, ఈ ఆరోపణలపై నటి కూడా స్పందించింది. అతడు పెళ్లి కాక ముందు నుండే వేధించేవాడని పేర్కొంది. మాకు మాయలు మాటలు చెప్పి.. మభ్య పెట్టి.. తనను వివాహం చేసుకున్నాడని తెలిపింది సీరియల్ నటి. సెలూన్ నడుపుతున్నాడని చెప్పి.. స్పా సెంటర్ ఏర్పాటు చేశాడని వెల్లడించింది.

‘సెలూన్ పై లక్ష.. ఉద్యోగంలో రూ.50 వేల జీతం వస్తుందని చెప్పడంతో.. పెళ్లి చేసుకున్నాను. ఎంగేజ్ మెంట్ ముందు రెండు నెలల కాలంలో అతడు వేధించాడు. షూటింగ్‌లో ఉండగానే.. వీడియో కాల్ చేసి హింసించేవాడు. వర్క్‌లో ఉన్నానని చెప్పినా వినిపించుకునే వాడు కాదూ.. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అలిగేవాడు. ప్రతి విషయంలో ఆర్గ్యుమెంట్ జరిగేది. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి అతడిలో వేరియేషన్స్ మారిపోతుంటాయి. ఇవన్నీ గెస్ చేయలేదు. పెళ్లి చేసుకున్నాక.. స్పా సెంటర్‌ అయితే మా వాళ్లు పెళ్లి చేసేవారే కాదూ. నా ఇష్ట ప్రకారమే అతడ్ని పెళ్లి చేసుకున్నప్పటికీ.. పెళ్లైన 16 రోజుల నుండే మా మధ్య గొడవలు జరిగాయి. హైదరాబాద్ వచ్చాక నన్ను టార్చర్ చేశాడు. అనుమానించాడు. అవమానించాడు’ అంటూ పేర్కొంది ఐశ్వర్య

Who is right aishwarya or shyam

ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోగా.. ఐశ్వర్య తల్లిదండ్రులు.. అతడో శాడిస్ట్.. మృగాడు అని, సొంత తమ్ముడిపై కూడా అనుమానించేవాడని, ఇలాంటి క్యారెక్టర్ పెట్టుకుని.. మా ఆడ పిల్లను కాపురానికి ఎలా పంపిస్తామంటూ.. మండిపడుతున్నారు. తన కూతురికి గతంలో పెళ్లి జరిగిందని ఫ్రూవ్స్ లేకుండా ఎలాంటి ఆరోపణలు చేస్తాడంటూ మండిపడ్డారు. అయితే శ్యామ్ తల్లిదండ్రులు చెబుతున్న దాని ప్రకారం.. ‘ రూపాయి కట్నం తీసుకోలేదు. పిల్ల అందంగా ఉందని.. లేని పిల్ల అయినా, నటి అని తెలిసినా కూడా చేసుకున్నాం. రెండు తులాల తాడు, 15 తులాల పట్టీలు ఇచ్చాం. పెళ్లైన వెంటనే వెళ్లిపోవాలని ఐశ్వర్య తల్లి చెప్పింది. అప్పుడే ఏంటమ్మా అని అడిగితే.. మీకేం తెలియదు అంటూ..నన్ను గయ్యాళిలా క్రియేట్ చేసింది. పిల్లను మా ఇంటికి తీసుకు రావాలని ఆమె ఇంటికి వెళితే.. ఐశ్వర్య తల్లి మమ్మల్ని కాలితో తన్నింది. మమ్మల్ని ఇష్టమొచ్చినట్లు’ ఏడ్చేసింది శ్యామ్ తల్లి. ఇందులో ఎవరి వాదనలు వారివి. ఈ ఘటనలో పెందుర్తిలో, హైదరాబాద్‌లో కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet