iDreamPost

Chandrakanth: ఐదేళ్లుగా సహజీవనం.. త్వరలోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు.. ఇంతలోనే

  • Published May 18, 2024 | 8:20 AMUpdated May 18, 2024 | 8:20 AM

సీరియల్‌ నటుడు చంద్రకాంత్‌ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పవిత్ర జయరామ్‌ మృతిని తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు..

సీరియల్‌ నటుడు చంద్రకాంత్‌ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పవిత్ర జయరామ్‌ మృతిని తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు..

  • Published May 18, 2024 | 8:20 AMUpdated May 18, 2024 | 8:20 AM
Chandrakanth: ఐదేళ్లుగా సహజీవనం.. త్వరలోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు.. ఇంతలోనే

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా వారం రోజుల క్రితం త్రినయని సీరియల్‌ ఫేమ్‌ పవిత్ర జయరామ్‌.. కారు యాక్సిడెంట్‌లో మృతి చెందింది. తన స్వగ్రామం వెళ్లి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్‌లో ఆమె చనిపోయింది. ఇక పవిత్ర మృతిని తట్టుకోలేక.. సీరియల్‌ నటుడు చంద్రకాంత్‌ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరూ త్రినయని సీరియల్‌లో కలిసి నటిస్తున్నారు. గత కొంత కాలంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారని టాక్‌. పవిత్ర చనిపోయిన నాటి నుంచి చంద్రకాంత్‌ డిప్రెషన్‌లో ఉన్నాడు. ఆమె మృతిని జీర్ణించుకోలేకపోయాడు. వరుస పోస్ట్‌లు చేస్తూ వస్తున్నాడు. ఇక రెండు రోజుల క్రితం పవిత్ర బర్త్‌డే. ఆ రోజు చంద్రకాంత్‌.. తన సోషల్‌ మీడియాలో రెండు రోజులు ఆగు అంటూ పోస్ట్‌ చేశాడు.

అప్పుడు దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తీరా చూస్తే.. చెప్పినట్లుగానే రెండు రోజుల తర్వాత శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక పవిత్రకు యాక్సిడెంట్‌ జరిగిన కారులోనే చంద్రకాంత్‌ కూడా ఉన్నాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పవిత్ర ప్రమాదంలో చనిపోలేదని.. తాను గాయపడటం చూసి.. గుండెపోటుతో మృతి చెందిందని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే చాలా మంది పవిత్ర-చంద్రకాంత్‌లు భార్యాభర్తలని భావిస్తున్నారు. కానీ కాదు. వీరిద్దరికి త్రినయని సీరియల్‌ టైమ్‌లోనే పరిచయం ఏర్పడింది. అప్పటికే పవిత్ర భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. ఇక చంద్రకాంత్‌ కూడా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. ఒంటరిగా ఉంటున్నాడు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక గత ఐదేళ్లుగా వీరు లివింగ్‌ రిలేషన్‌లో ఉంటున్నారు. త్వరలోనే తమ బంధాన్ని అధికారికం చేసుకోవాలని భావించారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంతలోనే ఇలాంటి దారుణం చోటు చేసుకుంది.

పవిత్ర చనిపోయిన తర్వాత.. చందు ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పవిత్ర మరణం అతడిని ఎంత కలచి వేసిందో.. దీన్ని చూస్తే అర్థం అవుతుంది. పవిత్ర చనిపోలేదని.. తమ మధ్యే ఉందన్నాడు. తాను కేవలం సీరియల్‌లో పవిత్రకు భర్తగా నటించలేదని.. పవిత్ర తన జీవితమంటూ ఎమోషనల్ అయ్యాడు. ఐదారేళ్లుగా పవిత్ర, చంద్రకాంత్ కలిసే ఉంటున్నారు. అయితే.. తమ మధ్య ఉన్న బంధాన్ని త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నామని.. కానీ ఇంతలోనే ఇలా జరిగిందంటూ చందు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అంతేకాక తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని.. తాను కూడా చనిపోతానేమోనంటూ చందు కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇదిలా ఉంటే.. చందుకు 2015లోనే పెళ్లి జరిగింది. 2015లో శిల్ప అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తెలుగులో త్రినయని, కార్తీక దీపం, రాధమ్మ పెళ్లి వంటి సీరియల్స్‌లో నటించాడు చంద్రకాంత్‌. ప్రస్తుతం కార్తీక దీపం-2 సీరియల్‌లోనూ నటిస్తున్నాడు. మరోవైపు.. పవిత్రకు కూడా పెళ్లి కాగా.. కొన్నేళ్లుగా తన భర్త నుంచి దూరంగా ఉంటోంది. పవిత్రకు 22 ఏళ్ల కుమారుడు, 19 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం పవిత్ర, చందు మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అలుముకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి