iDreamPost
android-app
ios-app

విషాదం.. స్టేజ్ పై నటిస్తూ మరణించిన ప్రముఖ నటుడు!

  • Published May 13, 2024 | 5:20 PM Updated Updated May 13, 2024 | 5:20 PM

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్టేజ్ పైనే నటిస్తూ కుప్పకూలి ప్రముఖ నటుడు మరణించారు. ఆ వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్టేజ్ పైనే నటిస్తూ కుప్పకూలి ప్రముఖ నటుడు మరణించారు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published May 13, 2024 | 5:20 PMUpdated May 13, 2024 | 5:20 PM
విషాదం.. స్టేజ్ పై నటిస్తూ మరణించిన ప్రముఖ నటుడు!

మరణం.. ఏ నిమిషాన ఎలా వస్తుందో? ఎటు నుంచి వస్తుందో? ఎవ్వరూ ఊహించలేరు. కొన్ని క్షణాల ముందు అందరితో కలిసి సరదాగా తిరిగిన వ్యక్తి.. ఆ తర్వాత వెంటనే మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్టేజ్ పై నటిస్తూనే ప్రముఖ నటుడు కుప్పకూలి మరణించిన విషాద సంఘటన అభిమానుల హృదయాలను కలచివేస్తోంది. ఈ విషాద వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రముఖ మరాఠీ నటుడు సతీశ్ జోషి సోమవారం ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు రాజేశ్ దేశ్ పాండే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్టేజ్ పై నటిస్తూ కుప్పకూలి సతీశ్ మరణించారని ఆయన తెలిపారు. “నా ఫ్రెండ్ సతీశ్ జోషి మరణించే ముందు రంగోత్సవ్ వేదికపై నటించారు. ఆయన ఉదయం 11 గంటలకు మరణించారు. చనిపోయే ముందు కూడా ఎంతో ఎనర్జీతో కనిపించారు” అని దేశ్ పాండే రాసుకొచ్చాడు.

మరాఠీలో పలు సీరియల్స్ లో నటించి నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సతీశ్ జోషి. ‘భాగ్యలక్ష్మి’ సీరియల్ లో చేసిన కీలక పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. నాటకాల్లో నటించడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందులో భాగంగానే ది క్రియేషన్ నాలుగో వార్షికోత్సవ్ సందర్భంగా రామభూమిలో జరుగుతున్న వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లోనే స్టేజ్ ఫర్ఫామెన్స్ ఇస్తూ కుప్పకూలి తుదిశ్వాస విడిచారు సతీశ్ జోషి. ఆయన అకాల మరణం ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఆయన మరణానికి కారణాల తెలియరాలేదు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom