iDreamPost
android-app
ios-app

కృష్ణ, చిరంజీవి సినిమాల్లో నటించింది, కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీ!

  • Published Feb 01, 2024 | 5:24 PM Updated Updated Feb 01, 2024 | 5:24 PM

కృష్ణ, చిరంజీవి సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ 30 ఏళ్ల తర్వాత ఏకంగా 51 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

కృష్ణ, చిరంజీవి సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ 30 ఏళ్ల తర్వాత ఏకంగా 51 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

  • Published Feb 01, 2024 | 5:24 PMUpdated Feb 01, 2024 | 5:24 PM
కృష్ణ, చిరంజీవి సినిమాల్లో నటించింది, కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీ!

ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లు సడెన్ గా కనుమరుగు అవుతుంటారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కొందరు పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమైతే.. మరికొందరు అవకాశాలు రాక పరిశ్రమకు దూరంగా ఉంటూ ఉంటారు. అయితే వెండితెరకు దూరమైన నటీ, నటులు చాలా గ్యాప్ తర్వాత ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇప్పుడు ఇదే బాటలో ఉంది. ఏకంగా 51 ఏళ్ల వయసులో సిల్వర్ స్క్రీన్ పై కనిపించి, ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతోంది. ఆమె గతంలో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణా తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి చిత్రాల్లో నటించింది కూడా. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆమె ఓ స్టార్ హీరోయిన్, తన కెరీర్ లో దాదాపు 35 సినిమాల్లో నటించింది. అందులో 3 తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. వాటిల్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘ముగ్గురు కొడుకులు’ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా యాక్ట్ చేసిన ‘కొదమ సింహం’ మూవీస్ ఉన్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సోనమ్ ఖాన్. సామ్రాట్ అనే తెలుగు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి.. అక్కడే బిజీగా మారింది. ఈ క్రమంలోనే దర్శకుడు, రైటర్, నిర్మాత అయినటువంటి రాజీవ్ రాయ్ ను పెళ్లి చేసుకుంది. దీంతో క్రమంగా ఇండస్ట్రీకి దూరమైంది.

అయితే వైహహిక జీవితంలో వచ్చిన ఇబ్బందుల కారణంగా తన భర్తకు 2016లో విడాకులు ఇచ్చింది సోనమ్ ఖాన్. ఏకంగా 30 ఏళ్లు వెండితెరకు దూరంగా ఉంది సోనమ్. ప్రస్తుతం సోనమ్ వయసు 51 సంవత్సరాలు. ఈ ఏజ్ లో మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుండటంతో.. తన ఓటు ఓటీటీలకే వేసింది. ఏదైనా వెబ్ సిరీస్ లో మంచి ఛాన్స్ వస్తే నటిస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచి మంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయని, త్వరలోనే మీ ముందుకు వస్తానని తెలిపింది సోనమ్ ఖాన్. అయితే నన్ను 40 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు గుర్తు పట్టకపోవచ్చి, కానీ నేను దానికి ఫీలవ్వనని, మళ్లీ గుర్తుపెట్టుకునే విధంగా చేస్తానని పేర్కొంది ఈ బ్యూటీ. మరి 51 ఏళ్ల ఏజ్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైన సోనమ్ ఖాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom