iDreamPost
android-app
ios-app

ఆ డైరెక్టర్‌ నా చీర పిన్ను తీసేయమన్నాడు: డ్రీమ్‌గర్ల్‌ హేమా మాలిని

  • Published Jul 10, 2023 | 11:35 AM Updated Updated Jul 10, 2023 | 11:35 AM
  • Published Jul 10, 2023 | 11:35 AMUpdated Jul 10, 2023 | 11:35 AM
ఆ డైరెక్టర్‌ నా చీర పిన్ను తీసేయమన్నాడు: డ్రీమ్‌గర్ల్‌ హేమా మాలిని

మిగతా రంగాలతో పోలిస్తే సినిమా రంగంలో వేధింపులు కాస్త ఎక్కువనే చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా అవకాశాల కోసం వచ్చే వారిని అనేకరకాలుగా వేధింపులకు గురి చేస్తుంటారు. కొత్తవారిని మాత్రమే కాక అల్రెడీ ఉన్నవారికి కూడా వేధింపులు తప్పడం లేదు. చిన్న చిన్న నటీనటులు మొదలు.. స్టార్‌ హీరోయిన్ల వరకు చాలా మంది వేధింపులుకు గురైనవారే ఉన్నారు. ఇక మీటూ ఉద్యమం ఫలితంగా.. చాలా మంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి నిర్భయంగా బయటకు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీనియర్‌ హీరోయిన్‌, డ్రీమ్‌ గర్ల్‌ హేమా మాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హేమా మాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో షూటింగ్‌ లోకేషన్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించారు. ‘‘హీరోయిన్‌గా నేను మంచి క్రేజ్‌ సంపాదించుకుంటున్న రోజుల్లో నాకు ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. అది కూడా సినిమా సెట్‌లో. ఆ విషయాన్ని నేను ఎప్పటికి మర్చిపోను. ఆ రోజు సినిమా షూటింగ్‌లో భాగంగా రొమాంటిక్‌ సీన్‌ తీస్తున్నారు. ఆ సమయంలో నేను చీర కట్టుకుంటే.. పైటకు పిన్ను పెట్టుకునేదాన్ని. కానీ దర్శకుడు ఆ రోజు షూటింగ్‌ జరుగుతుండగా.. పైటకు పెట్టుకున్న పిన్ను తీయమన్నాడు. అప్పుడు నేను అలా చేస్తే.. పైట జారిపోతుంది కదా అన్నాను. అందుకు ఆ దర్శకుడు నాకు కావాల్సింది అదే కాదా అన్నాడు. అతడి మాటలకు నేను షాక్‌ అయ్యాను’’ అని తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌, ధర్మేంద్రతో వివాహం, పిల్లల గురించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు హేమా మాలిని. తాను, ధర్మేంద్ర కలిసి షోలే, సీతా ఔర్‌ గీతా వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కలిసి నటించాము. ఆ సమయంలోనే మేం ప్రేమలో పడ్డాం అని తెలిపారు. హేమామాలిని, ధర్మేంద్ర 1980లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికే పెళ్లైన ధర్మేంద్రను రెండో వివాహం చేసుకున్నారు హేమామాలిని. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కుమార్తెల విషయంలో తన భర్త చాలా జాగ్రత్తగా ఉంటారని.. ఆయన ఎప్పుడు కంగారు పడుతూ ఉండేవారిని చెప్పుకొచ్చారు. అలానే సత్యం శివం సుందరం సినిమా ఆఫర్‌ ఫస్ట్‌ తనకే వచ్చిందని.. అయితే అప్పటి పరిస్థితుల దృష్ట్యా తాను ఆ ఆఫర్‌ వద్దనుకున్నానని తెలిపారు. ఇక హేమా మాలిని ఈ వయసులో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ముబై వీధుల్లో, మెట్రోలో ప్రయాణం చేస్తూ.. సామాన్యులతో ఈజీగా కలిసి పోతారు. ప్రస్తుతం హేమా మాలిని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetovis girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis