iDreamPost
android-app
ios-app

వర్మ ముందే వర్మను తిట్టిన నటుడు శివాజీ రాజా!

  • Published Oct 28, 2023 | 2:55 PM Updated Updated Nov 03, 2023 | 11:56 AM

ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తలకోన అడవిలో తాను కొన్ని సినిమా షూటింగ్స్‌లో పాల్గొన్నాను. అడవుల నేపథ్యంలో సినిమా అంటే చాలా కష్టంగా ఉంటుందని తెలిపారు.

ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తలకోన అడవిలో తాను కొన్ని సినిమా షూటింగ్స్‌లో పాల్గొన్నాను. అడవుల నేపథ్యంలో సినిమా అంటే చాలా కష్టంగా ఉంటుందని తెలిపారు.

  • Published Oct 28, 2023 | 2:55 PMUpdated Nov 03, 2023 | 11:56 AM
వర్మ ముందే వర్మను తిట్టిన నటుడు శివాజీ రాజా!

ప్రముఖ సీనియర్‌ నటుడు శివాజీ రాజా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై సంచలన కామెంట్లు చేశారు. ‘రామ్‌ గోపాల్‌ వర్మ తీసినంత చెత్త సినిమాలు ఎవరూ తీసి ఉండరు’ అని అన్నారు. వర్మముందే ఆయన ఈ కామెంట్ల చేయటం గమనార్హం. ‘తలకోన’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ సంగతేంటంటే.. అప్సర రాణీ ప్రధాన పాత్రలో నటించిన ‘తలకోన’ అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా ఈవెంట్‌ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో శివాజీ రాజా, రామ్‌ గోపాల్‌ వర్మ హాజరయ్యారు.

ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తలకోన అడవిలో తాను కొన్ని సినిమా షూటింగ్స్‌లో పాల్గొన్నాను. అడవుల నేపథ్యంలో సినిమా అంటే చాలా కష్టంగా ఉంటుందని తెలిపారు. వాటిని అధిగమించి సినిమా తీయటంలో చిత్ర యూనిట్‌ సంకల్పం కనిపిస్తోందని అన్నారు. తాను 1985లో సినిమాల్లోకి వచ్చానని, అప్పటి వరకు పరిశ్రమ ఎంతో ప్రశాంతంగా ఉండేదని అన్నారు. 1988లో వచ్చిన శివ సినిమాతో అలజడి మొదలైందని తెలిపారు. రాము అనే పేరులోనే వైబ్రేషన్‌ ఉందన్నారు. ఆయన తీసిన సినిమాల్లో క్షణక్షణం తనకు బాగా ఇష్టమైన సినిమా అన్నారు. ఆ సినిమాలో కనిపించినంత అందంగా శ్రీదేవీ ఏ సినిమాలో కనిపించలేదని వెల్లడించారు.

తలకోన సినిమా వర్మది అయినా, కాకపోయినా.. ఆయన కంటే సీనియర్ గా ఆయన గురించి మాట్లాడాల్సిన బాధ్యత తనకు ఉందని అన్నారు. వర్మ తీసినన్ని అద్భుతమైన సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ తీయలేదని కొనియాడారు. అంతేకాదు! ఆయన తీసినన్ని చెత్త సినిమాలు కూడా ఎవరు తీయలేదని పేర్కొన్నారు. రెండు రికార్డ్స్ ఆయనకే ఉన్నాయని తెలిపారు. కానీ, ఆయన నుంచి తనలాంటి ఫ్యాన్స్ మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారని అన్నారు. మరి, శివాజీ రాజా వర్మ ముందే వర్మను కామెంట్‌ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom