iDreamPost
android-app
ios-app

అభిమానిపై చేయిచేసుకున్న ప్రముఖ నటుడు.. వీడియో వైరల్

  • Published Nov 15, 2023 | 1:53 PM Updated Updated Nov 15, 2023 | 1:53 PM

బహిరంగ ప్రాంతాల్లో నటీనటులు కనిపిస్తే.. వారిని తిలకించేందుకు అభిమానులు ఎగబడుతుంటారు. హీరోయిన్లు కనిపిస్తే.. వారిని అనుచితంగా తాకిన సంఘటనలు కూడా ఉన్నాయి. హీరోల కాళ్లపై పడిపోవడాలు, కౌగిలింతలు, సెల్ఫీలంటూ విసిగిస్తుంటారు. దీంతో సహనం కోల్పోయి..

బహిరంగ ప్రాంతాల్లో నటీనటులు కనిపిస్తే.. వారిని తిలకించేందుకు అభిమానులు ఎగబడుతుంటారు. హీరోయిన్లు కనిపిస్తే.. వారిని అనుచితంగా తాకిన సంఘటనలు కూడా ఉన్నాయి. హీరోల కాళ్లపై పడిపోవడాలు, కౌగిలింతలు, సెల్ఫీలంటూ విసిగిస్తుంటారు. దీంతో సహనం కోల్పోయి..

  • Published Nov 15, 2023 | 1:53 PMUpdated Nov 15, 2023 | 1:53 PM
అభిమానిపై చేయిచేసుకున్న ప్రముఖ నటుడు.. వీడియో వైరల్

షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అయినా, సినిమా షూటింగ్ జరుగుతున్నా.. యాక్టర్స్‌ను చూసేందుకు జనం ఎగబడుతూ ఉంటారు. ఇక వారితో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. పోటీ పడుతుంటారు. అభిమానులు పేరుతో వచ్చి హీరోయిన్లను ఇబ్బందులకు గురి చేయడం, హీరో కాళ్లపై పడిపోవడం, కౌగిలించుకోవడం వంటి చర్యలు దిగుతుంటారు. ఆ సమయంలో నటీనటులు కొంత అసహనానికి గురౌతుంటారు. ఆ సమయంలో ఒక్కొక్కసారి అభిమానులపై కోపాన్ని ఏదో ఒక రూపంలో ప్రదర్శించి వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మొన్నటి మొన్న ఓ అవార్డు ఫంక్షన్ లో మంచు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి అడ్డురాగా.. చెయ్యి చేసుకున్న సంగతి విదితమే. ఓ తాజాగా ప్రముఖ నటుడు ఇలానే ప్రవర్తించి చర్చకు దారి తీశారు.

విలక్షణ నటుడు నానా పటేకర్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. బాలీవుడు, మరాఠి సినిమాల్లో తన హవాను చాటిన ఈ నటుడు.. కొంత విరామం తర్వాత ఇప్పుడు బిజీబిజీగా మారాడు. ది వ్యాక్సిన్ వార్ అంటూ ఇటీవల పలకరించిన ఆయన.. తన తదుపరి చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో షూటింగ్ జరుగుతుంది. అయితే అక్కడ షూటింగ్ జరుగుతుందని, నానా పటేకర్ ఉన్నాడని తెలిసి.. అభిమానులు పెద్ద యెత్తున అక్కడకు చేరుకున్నారు. ఓ అభిమాని వచ్చి అతడితో సెల్ఫీ దిగేందుకు రాగా, అతడి నెత్తిపై ఒక్కటి పీకారు. అంతే అక్కడే ఉన్న ఇతర సిబ్బంది అతడిని అక్కడి నుండి పంపించేశారు. అయితే ఈ ఘటన మొత్తం వీడియో రూపంలో నెట్టింట్లోకి రావడంతో మండిపడుతున్నారు నెటిజన్లు.

కొందరు నానా పటేకర్‌కు అనుకూలంగా మాట్లాడితే.. మరికొందరు అతడికి సపోర్టుగా కామెంట్లు పెడుతున్నారు. పూర్ కిడ్ అంటూ ఓ నెటిజన్ రెడ్టిట్ లో రాశాడు. ఇది తప్పు అంటూ మరో వ్యక్తి ట్విటర్‌లో కామెంట్ చేశాడు. అయితే నానా పటేకర్ వివాదంలో చిక్కుకోవడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో మీ టూ ఉద్యమం సమయంలో లైంగికపరమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ అవుతున్న సమయంలో మరోసారి ఈ వీడియోతో వార్తల్లో నిలిచారు. తర్వలో ఆయన ఓటీటీలోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ ‘లాల్ బట్టి’తో తన OTT అరంగేట్రం చేయనున్నాడు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş