iDreamPost
android-app
ios-app

Rakesh Master: కన్నీరు కారుస్తూ.. రాకేష్ మాస్టర్ పాడె మోసిన శేఖర్, జానీ మాస్టర్లు

  • Author Soma Sekhar Published - 06:13 PM, Mon - 19 June 23
  • Author Soma Sekhar Published - 06:13 PM, Mon - 19 June 23
Rakesh Master: కన్నీరు కారుస్తూ.. రాకేష్ మాస్టర్ పాడె మోసిన శేఖర్, జానీ మాస్టర్లు

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. దాంతో ఇండస్ట్రీ మెుత్తం ఒక్కసారిగా షాక్ కు గురైంది. దాదాపు 1500 సినిమాలకు పైగా కొరియోగ్రాఫర్ గా పనిచేశారు రాకేష్ మాస్టర్. ఆయన దగ్గర శిష్యరికం చేసిన ఎందరో ఇప్పుడు మాస్టర్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వారిలో శేఖర్, జానీ మాస్టర్లు ఒకరు. రాకేష్ మాస్టర్ మరణంతో.. తమ గురువును కడసారి చూడటానికి వచ్చారు శేఖర్ మాస్టర్,జానీ మాస్టర్. కన్నీరు కారుస్తూ.. మాస్టర్ పార్థీవదేహాన్ని మోశారు ఇద్దరు మాస్టర్లు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాకేష్ మాస్టర్ మరణించిన వార్త తెలుసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్లు అందరు ఆయనను చివరిసారిగా చూడటానికి వచ్చారు. అందులో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్లలతో పాటుగా మరికొంత మంది మాస్టర్లు వచ్చారు. అయితే వీరిలో ప్రత్యేకమైంది శేఖర్ మాస్టర్ రావడమే. దానికి కారణం మనందరికి తెలిసిందే. ఇక తాను చనిపోతే తన శవాన్ని చూడ్డానికి కూడా రావొద్దని రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కు చెప్పారు. కానీ అవన్ని పక్కన పెట్టి తన గురువు చివరి చూపు కోసం బరువెక్కిన హృదయంతో వచ్చారు శేఖర్ మాస్టర్.

ఇక జానీ మాస్టర్ సైతం రాకేష్ మాస్టర్ ను అలా చూసి చలించిపోయారు. కూతురు, కొడుకు గుండెలు పగిలేలా ఏడుస్తుంటే.. వచ్చిన జనాలు సైతం చూడలేకపోయారు. ఇక గురు దక్షిణ కింద రాకేష్ మాస్టర్ పాడె మోశారు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు. ఆయన రుణాన్ని పాడె మోసి తీర్చుకున్నారు శిష్యులు. భారమైన గుండెలతో, చెమర్చిన కళ్లతో ఇద్దరు మాస్టర్లు పాడె మోశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabet