iDreamPost
android-app
ios-app

నటి విజయలక్ష్మి దెబ్బకు ఆస్పత్రి పాలైన దర్శకుడు!

  • Published Sep 02, 2023 | 3:38 PM Updated Updated Sep 02, 2023 | 3:38 PM
  • Published Sep 02, 2023 | 3:38 PMUpdated Sep 02, 2023 | 3:38 PM
నటి విజయలక్ష్మి దెబ్బకు ఆస్పత్రి పాలైన దర్శకుడు!

ప్రముఖ తమిళ దర్శకుడు, నామ్‌ తమిళర్‌ పార్టీ అధినేత సీమాన్‌ అనారోగ్యం పాలయ్యారు. శుక్రవారం కోయంబత్తూరులోని పల్లాడంలో నిరసన కార్యక్రమం కోసం వెళుతుండగా ఆయన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ని హుటాహుటిన పల్లాడంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే, నటి విజయలక్ష్మి సీమాన్‌పై న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఆయన అనారోగ్యానికి గురవ్వటం చర్చనీయాంశంగా మారింది.

సీమాన్‌ పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ నటి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆమె 2011లో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. పెళ్లి పేరుతో సీమాన్‌​ తన జీవితాన్ని నాశనం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, అప్పటినుంచి ఆమె ఆయనపై న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు.  ఆయనపై తన సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాంలలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. తాజాగా, మరో సారి సీమాన్‌పై పోలీస్‌ స్టేషన్లో విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. సీమాన్‌ పాత కేసును వెనక్కు తీసుకోవాలని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆమెను స్టేషన్‌కు పిలిపించారు. ఆమెను పలు రకాలుగా ప్రశ్నించారు. దర్యాప్తు కూడా మొదలుపెట్టారు. సీమాన్‌ గనుక విజయలక్ష్మిని మోసం చేశాడని తేలితే.. ఆయన అరెస్ట్‌ కాకతప్పదు. కాగా, సీమాన్‌ నటుడిగా.. దర్శకుడిగా.. స్టోరీ రైటర్‌గా.. సింగర్‌గా.. పాటల రచయితగా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. తమిళనాట సినీ ప్రముఖుడిగా ఆయనకంటూ ఓమంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయన సినిమాలు మానేసి రాజకీయాల్లో బిజీ అయిపోయారు. మరి, విజయలక్ష్మి ఆరోపణల నేపథ్యంలో సీమాన్‌ అనారోగ్యం పాలవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş