iDreamPost
android-app
ios-app

సూపర్ స్టార్ సరసన సెకండ్ ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్..?

  • Author ajaykrishna Published - 09:58 AM, Tue - 25 July 23
  • Author ajaykrishna Published - 09:58 AM, Tue - 25 July 23
సూపర్ స్టార్ సరసన సెకండ్ ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్..?

ఇండియాలో సూపర్ స్టార్ రజినీతో సినిమా ఛాన్స్ అంటే ఏ ఒక్క హీరోయిన్ కూడా వదులుకోవాలని అనుకోదు. ఎందుకంటే.. సూపర్ స్టార్ పై ఉన్న అభిమానం, రెస్పెక్ట్.. ఆయనతో తెరపై కనిపించాలని డ్రీమ్ దాదాపు అందరు ముద్దుగుమ్మలకు ఉంటుంది. తలైవార్ ఇప్పుడు మోస్ట్ సీనియర్ కాబట్టి.. ఇదివరకటిలా హీరోయిన్స్ కి జోడిగా రిస్కీ మూవీస్ చేయలేరు. కానీ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మాత్రం సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ కి రజినీ సరసన నటించాలని డ్రీమ్ ఉన్నప్పటికీ.. ఆల్రెడీ ఓ సినిమా చేసిన హీరోయిన్ కే మళ్లీ ఛాన్స్ రావడమంటే అదృష్టం అనే చెప్పాలి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ఉన్న ఓ స్టార్ హీరోయిన్ కి అలాంటి ఛాన్స్ దక్కిందని టాక్.

జైలర్ సినిమా తర్వాత రజినీ 170వ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 10న జైలర్ రిలీజ్ అవుతుండగా.. ఆ సినిమాని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమా తర్వాత రజినీ 170వ సినిమా.. జై భీమ్ ఫేమ్ టి.జే. జ్ఞానవెల్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ప్రెజెంట్ ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దీంతో హీరోయిన్ కోసం శోధన మొదలు పెట్టారట దర్శకనిర్మాతలు. అయితే.. హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో.. ఓ స్టార్ హీరోయిన్ పేరు మైండ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. పైగా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న హీరోయిన్ కావడంతో ఆమెనే తీసుకుంటే బెటర్ అని ఆలోచన చేస్తున్నారట.

ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? అనుకుంటున్నారా.. ఇంకెవరు ప్రభాస్ తో కల్కి మూవీ చేస్తున్న దీపికా పదుకొనే. పైగా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కొంచం మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుందని.. అందుకే స్టార్ హీరోయిన్ అయితే బెటర్ అని చూస్తున్నారట మేకర్స్. దీంతో ఈసారి రజినీ జోడిగా దీపికా రానుందని కోలీవుడ్ వర్గాల టాక్. ఈ మధ్యకాలంలో రజినీ సరసన ఈ స్టార్ హీరోయిన్ రెండుసార్లు వర్క్ చేయలేదు. కానీ.. ఆ లక్ దీపికాకు దక్కిందని చెప్పాలి. ఎందుకంటే.. గతంలో దీపికా తలైవార్ తో ‘విక్రమసింహా’ మూవీ చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ.. ఈసారి అలా కాకుండా వీరి కాంబినేషన్ కి మంచి మూవీ అవుతుందని అంటున్నారు అభిమానులు. మరి రజినీ, దీపికా కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet