iDreamPost
శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లుతో పాటు హాలీవుడ్ మూవీ బ్యాట్ మ్యాన్ తో నేరుగా క్లాష్ చేయబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇవాళ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లుతో పాటు హాలీవుడ్ మూవీ బ్యాట్ మ్యాన్ తో నేరుగా క్లాష్ చేయబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇవాళ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
iDreamPost
ఎస్ఆర్ కళ్యాణమండపంతో గత ఏడాది సంచలన విజయం అందుకుని అనూహ్యంగా మార్కెట్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన సెబాస్టియన్ మార్చి 4న విడుదల కానుంది. శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లుతో పాటు హాలీవుడ్ మూవీ బ్యాట్ మ్యాన్ తో నేరుగా క్లాష్ చేయబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇవాళ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో సిద్ధారెడ్డి-ప్రమోద్ లు దీన్ని నిర్మించారు. టీజర్ కొద్దిరోజుల క్రితం ఆకట్టుకునేలా కట్ చేయడంతో దీని మీద అంచనాలు పెరిగాయి. ఇంతకీ మ్యాటర్ ఏముందో చూద్దాం.
న్యాయం ఉద్యోగం రెండింటిలో ఏది ముఖ్యమంటే మొదటిదే అని చెప్పే తల్లి పెంపకంలో ఎదిగిన సెబాస్టియన్(కిరణ్ అబ్బవరం) కు రేచీకటి జబ్బు ఉంటుంది. కష్టపడి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించినా ఆ లోపాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా మేనేజ్ చేస్తుంటాడు. ఖాకీ దుస్తులు వేసుకున్నాక నైట్ డ్యూటీలు చేయాల్సి వచ్చినప్పుడంతా అదో గండంగా భావిస్తాడు. కానీ అన్నిసార్లు నిజాన్ని దాచలేంగా. ఒక కేసు విషయంలో ఈ రేచీకటి వల్లే చేయని తప్పుకు సెబాస్టియన్ సస్సెండ్ అవుతాడు. మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు తనే స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏమయ్యిందనేది సినిమా.
ట్రైలర్ ని ఆసక్తికరంగానే కట్ చేశారు. కిరణ్ అబ్బవరం మరోసారి రాయలసీమ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు. మదనపల్లె కేంద్రంగా కథను నడిపించారు. కామెడీ, యాక్షన్ రెండూ బాలన్స్ చేస్తూ ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దిన ప్రయత్నం కనిపిస్తోంది. నువేక్ష – కోమలి ప్రసాద్ హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాహో, రాక్షసుడు ఫేమ్ గిబ్రాన్ డెన్నిస్ సంగీతం సమకూర్చడం విశేషం రాజ్ కె నల్లి ఛాయాగ్రహణం అందించారు. బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ మధ్య కొత్త తరహాలో కనిపిస్తున్న సెబాస్టియన్ ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతున్నాడో చూడాలి
https://www.youtube.com/watch?v=3OD16UULtmg
Also Read : Bheemla Nayak Collections : వేగంగా వంద కోట్ల క్లబ్బులోకి పవన్ సినిమా