దళపతి విజయ్​ కోసం స్టోరీ రెడీ.. త్వరలో సినిమా తీస్తా: స్టార్ క్రికెటర్

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్​కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తెలుగు నాట కూడా ఆయన సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది.

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్​కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తెలుగు నాట కూడా ఆయన సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్​కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తెలుగు నాట కూడా ఆయన సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. తాను నటించే ఫిల్మ్స్​ను తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేస్తుంటారాయన. ‘తుపాకీ’, ‘బీస్ట్’, ‘మాస్టర్’, ‘అదిరింది’, ‘విజిల్’, ‘లియో’ సినిమాలతో ఇక్కడ మార్కెట్​ను ఏర్పర్చుకున్నారు విజయ్. ఆయన నుంచి ఓ చిత్రం వస్తోందంటే తమిళం రేంజ్​లో కాకపోయినా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి క్రేజ్ నెలకొంటోంది. దీనికి ‘లియో’కి వచ్చిన భారీ కలెక్షన్లే ఎగ్జాంపుల్. దళపతితో సినిమాలు తీసేందుకు డైరెక్టర్స్ క్యూ కడుతుంటారు. ఆయనతో ఒక్క మూవీ తీసినా చాలని కోరుకునే మేకర్స్ కూడా ఉన్నారు. అయితే ఈ లిస్టులో తాజాగా ఓ క్రికెటర్ చేరడం గమనార్హం.

విజయ్​తో సినిమా తీయాలని ఉందంటున్నాడో స్టార్ క్రికెటర్. ఆయన కోసం ఇప్పటికే కథ కూడా రాసేశానని.. ఓకే అంటే సెట్స్ మీదకు వెళ్లడమేనని చెబుతున్నాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. భారత జట్టుతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ఆడటం ద్వారా క్రేజ్ దక్కించుకున్నాడు వరుణ్. ఈ సీజన్​ ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్ ఛాంపియన్​గా నిలవడంలో అతడికి కూడా కీలక పాత్రే. అలాంటి స్పిన్నర్ మూవీస్ గురించి మాట్లాడుతూ తనకు దళపతి విజయ్ అంటే చాలా ఇష్టమన్నాడు. ఆయన కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేశానని తెలిపాడు. విజయ్ ఓకే అంటే స్వీయ దర్శకత్వంలో సినిమా తీస్తానని చెప్పాడు.

‘హీరో విజయ్ కోసం నేనో కథ రాశా. ఆయన ఓకే అంటే సినిమా తీస్తా. స్టోరీ కావాలని అడిగితే ఆయనకు ఇచ్చేస్తా. కమ్​బ్యాక్​ ఫిల్మ్​లా ఉపయోగపడుతుంది. ఫిల్మ్‌ మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నాలోని క్రియేటివిటీని కాపాడుకునేందుకు దాన్నో మాధ్యమంలా భావిస్తా. తరచూ కథలు రాస్తుంటా. విభిన్నమైన పాత్రలతో డిఫరెంట్ సిచ్యువేషన్స్​ను క్రియేట్ చేసి స్టోరీస్ డెవలప్ చేయడం నాకిష్టం. నా దగ్గర మూడు కథలు ఉన్నాయి. ఇవన్నీ ఫుల్ బౌండ్‌ స్క్రిప్ట్స్. డైలాగ్స్, స్క్రీన్​ప్లే కూడా రాసేశా’ అని వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. ఇక, విజయ్ ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్​టైమ్’లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. పొలిటికల్ ఎంట్రీ తర్వాత తాను ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో పడ్డారాయన. మరి.. విజయ్​తో వరుణ్ చక్రవర్తి మూవీ తీస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments