iDreamPost
android-app
ios-app

విజయ్‌ ఆంటోనీ ఎలాంటి వాడో చెప్పిన సత్యరాజ్‌!

  • Published Nov 30, 2023 | 1:00 PM Updated Updated Nov 30, 2023 | 1:00 PM

హీరో విజయ్‌ ఆంటోనీకి తమిళనాటే కాదు.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అవుతున్నాయి...

హీరో విజయ్‌ ఆంటోనీకి తమిళనాటే కాదు.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అవుతున్నాయి...

  • Published Nov 30, 2023 | 1:00 PMUpdated Nov 30, 2023 | 1:00 PM
విజయ్‌ ఆంటోనీ ఎలాంటి వాడో చెప్పిన సత్యరాజ్‌!

విజయ్ ఆంటోని.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. బిచ్చగాడు సినిమాతో టాలివుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన “వల్లి మయిల్” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా కొలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఇందులో నటుడు సత్యరాజ్‌, దర్శకుడు భారతీరాజా, రెడిన్ కింగ్స్ లీ, జీపి ముత్తు ముఖ్యపాత్రలు పోషించారు.

గతంలో జీవా, పాండినాడు, అళగర్ సామియన్, కుదరై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సుశీంద్రన్ ఇప్పుడు వల్లి మయిల్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మూవీ మేకర్స్ మంగళవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. అయితే.. వల్లి మయిల్ సినిమాను నల్లుస్వామి పతకంపై డీఎన్ తాయ్ శరవణన్ నిర్మించారు. ఈ చిత్రానికి డి. ఈమన్ సంగీతాన్ని అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడుతూ.. ‘‘ విజయ్ ఆంటోని ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా.. సినిమాలో పోలీస్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. ఇక సత్యరాజ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం’’ అని అన్నారు. ఈ క్రమంలో నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. ‘‘ విజయ్ చాలా నిరాడంబరమైన వ్యక్తి , మంచి నటుడు యథార్థంగా మాట్లాడతారు’’ అన్నారు.

ఇక దర్శకుడు విజయ్ ని ప్రస్తావిస్తూ.. ‘‘ సాధారణంగా హీరోయిన్ పేరుతో రూపొందే చిత్రాల్లో నటించడానికి హీరోలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం కాదు అసలు అంగీకరించరు. ఎందుకంటే వాళ్లకి ఈగో అడ్డుపడుతుంది. అయితే అప్పటిలో ‘ఎంజీఆర్ విషయానికి వస్తే.. చంద్రలేఖ, రాజకూమారి, ఇక రజనికాంత్.. చంద్రముఖి వంటి హీరోయిన్ పేర్లతో కూడిన చిత్రల్లో నటించేవారు. ఆ తరువాత మళ్లీ విజయ్ ఆంటోని వల్లి మయిల్ చిత్రంలో నటించారని అభినందించారు’.

కాగా, విజయ్‌ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో తెలుగులో పిచ్చపాపులారిటీ తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఆయన బిచ్చగాడు 2 చిత్రంతో తాజాగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు వల్లి మయిల్‌తో రాబోతున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. బహుశా ఈ సినిమా 2024 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఊహాగానాలు అందుతున్నాయి. మరి, విజయ్ ఆంటోని నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం పై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş