sarkari vari pata సర్కారు త్వరగా స్పీడు పెంచాలి

ఈ రోజు మినహాయిస్తే ఇంకో రెండే రోజుల్లో సర్కారు వారి పాట థియేటర్లలో అడుగు పెట్టనుంది. సుమారు 125 కోట్ల బిజినెస్ జరుపుకున్న మహేష్ సినిమా కేవలం తెలుగు వెర్షన్ నుంచే అంత మొత్తాన్ని షేర్ రూపంలో రాబట్టాల్సి ఉంటుంది. పుష్ప, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లకున్న ప్యాన్ ఇండియా అడ్వాంటేజ్ దీనికి లేదు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలూ హిట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ సోసోగా అనిపించినా ఫైనల్ గా మహేష్ ఎమోషనల్ స్పీచ్ ఫ్యాన్స్ ని కట్టి పడేసింది. అయితే ఇప్పటిదాకా ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాకపోవడం అభిమానులను ఖంగారు పెడుతోంది. సాయంత్రం నుంచి స్టార్ట్ అవ్వొచ్చట.

ఏపిలో నలభై ఐదు రూపాయల చొప్పున పెంచుకునేందుకు అనుమతులు వచ్చాయి కాబట్టి అక్కడ సమస్య లేదు. తెలంగాణలో ఇందాకే మల్టీప్లెక్సుకు 50 రూపాయలు, సింగల్ స్క్రీన్ కి 30 రూపాయలు పర్మిషన్ ఇచ్చారు. ఇలా ఆలస్యం కావడం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తోంది. కనీసం అయిదారు రోజుల ముందు పెట్టడం వల్ల ఆడియన్స్ ని ఫలానా షోకి ఫలానా టైంలో ఖచ్చితంగా లాక్ చేసుకున్నట్టు అవుతుంది. అలా కాకుండా తక్కువ గ్యాప్ ఉన్నప్పుడు రిపోర్ట్స్ చూసి డిసైడ్ అవుదామనుకుంటారు. సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఎంత మహేష్ సినిమా అయినా సరే ప్రేక్షకులు మరీ గుడ్డిగా చూసే తీరాలని ప్రమాణం చేసుకోరుగా.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వల్ల బుకింగ్స్ లేట్ అవుతున్నట్టుగా తెలిసింది. బెనిఫిట్ షోలకు సంబంధించిన కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండున్నరేళ్లతో గ్యాప్ తో వస్తున్న మహేష్ కు స్వాగతం చెప్పేందుకు థియేటర్లు ముస్తాబవుతున్నాయి. ఆచార్య ఫైనల్ రన్ కు వచ్చేసింది కాబట్టి స్క్రీన్ల సమస్య లేదు. భారీ కౌంట్ దక్కనుంది. కాకపోతే ఇది క్యాష్ చేసుకోవాలంటే వీలైనంత త్వరగా బుకింగ్స్ ఇచ్చేయాలి.దర్శకుడు పరశురామ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇతర టీమ్ సభ్యుల మాటలు వింటూ ఉంటే ఒక్కడు దూకుడు రేంజ్ హిట్ ఖాయమనిపిస్తోంది. చూద్దాం

Show comments