iDreamPost
android-app
ios-app

చరణ్‌ సినిమాలో హీరోయిన్‌గా సచిన్‌ కూతురు!

  • Published Nov 21, 2023 | 11:37 AM Updated Updated Nov 21, 2023 | 12:08 PM

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రామ్‌ చరణ్‌ ఓకే చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ వైరల్‌గా మారింది.

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రామ్‌ చరణ్‌ ఓకే చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ వైరల్‌గా మారింది.

  • Published Nov 21, 2023 | 11:37 AMUpdated Nov 21, 2023 | 12:08 PM
చరణ్‌ సినిమాలో హీరోయిన్‌గా సచిన్‌ కూతురు!

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో రిజీల్‌ అవ్వనుంది. ఇక, రామ్‌ చరణ్‌ తన 16 సినిమాకు సైన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్‌ బుచ్చి బాబు సాన దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. బుచ్చిబాబు నటీ,నటులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ఆర్‌సీ 16కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ మీడియా, సోషల్‌ మీడియా సర్కిల్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్‌ ప్రకారం.. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ కూతురు సారా టెండుల్కర్‌ హీరోయిన్‌గా నటించబోయే అవకాశం ఉందట. చిత్ర దర్శకుడు కథకు కొత్త హీరోయిన్‌ అయితే బాగుంటుందని భావించారట. ఈ నేపథ్యంలోనే సారా టెండుల్కర్‌ ఆ పాత్రకు సరిగ్గా సూట్‌ అవుతుందని అనుకున్నారట. ఆమెను సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారట.

 ఇక, ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలీదు. సినిమా టీం కానీ, దర్శకుడు బుచ్చిబాబు గానీ, అధికారంగా స్పందిస్తేనే అసలు విషయాలు తెలుస్తాయి. పుకార్లే గనుక నిజం అయితే.. సారా.. రామ్‌ చరణ్‌తో కలిసి నటించడానికి ఒప్పుకుంటే.. చెర్నీ ఫ్యాన్స్‌తో పాటు సచిన్‌ ఫ్యాన్స్‌ కూడా పండగే అని చెప్పాలి. ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో విడుదలయ్యే ఈ సినిమాకు కలెక్షన్ల మోత మోగక మానదు. కాగా, ఆర్‌సీ16కు సంబంధించి మరో న్యూస్‌ కూడా ప్రచారంలో ఉంది. ఆ న్యూస్‌ ప్రకారం..

‘‘ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటించబోతున్నారు. మూవీ మేకర్స్ కూడా త్వరలోనే ఈ న్యూస్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు’’ అన్న ప్రచారం జరిగింది. ఇప్పుడేమో ఆ సినిమాలో సారాను తీసుకోవటానికి సంప్రదింపులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఏ వార్త నిజమో తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సిందే. ఇక, రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ చిత్రం రామ్‌ చరణ్‌కు మరింత క్రేజ్ తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి, రామ్‌ చరణ్‌ ఆర్‌సీ 16లో సచిన్‌ కూతురు సారా హీరోయిన్‌గా చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై మీ  అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş