iDreamPost
android-app
ios-app

తెలుగులో విడుదలవుతున్న ఆ సూపర్‌ హిట్‌ లవ్‌ సినిమా!

  • Published Sep 15, 2023 | 9:40 PM Updated Updated Sep 15, 2023 | 9:40 PM
  • Published Sep 15, 2023 | 9:40 PMUpdated Sep 15, 2023 | 9:40 PM
తెలుగులో విడుదలవుతున్న ఆ సూపర్‌ హిట్‌ లవ్‌ సినిమా!

కన్నడ స్టార్‌ హీరో రక్షిత్‌ శెట్టి.. హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ జంటగా నటించిన కన్నడ సినిమా ‘సప్త సాగదచ ఎల్లో’. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు కన్నడలో వచ్చిన రెస్పాన్స్‌ కారణంగా.. ఇతర భాషల్లోనూ రిలీజ్‌కు సిద్ధం చేశారు నిర్మాతలు. ముందుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి రంగం సిద్ధం చేశారు.

ఈ మేరకు తెలుగు టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమా తెలుగులో ‘ సప్త సాగరాలు దాటి’ అన్న టైటిల్‌తో విడుదల కానుంది. ఈ నెల 22న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోని పలు థియేటర్లలో సందడి చేయనుంది. కాగా, ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగానికి ఏ సైడ్‌ అని .. రెండో భాగానికి బీ సైడ్‌ అని పేరు పెట్టారు. ఏ సైడ్‌ను ప్రస్తుతం తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు. ఏ సైడ్‌కు వచ్చిన స్పందనను బట్టి బీ సైడ్‌ను రిలీజ్‌ చేయనున్నారు నిర్మాతలు.

ఇక, రక్షిత్‌ శెట్టికి తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. ఆయన నటించిన తాజా చిత్రం ‘777 ఛార్లీ’ దేశ వ్యాప్తంగా మంచి విజయాన్ని నమోదు చేసింది. రక్షిత్‌ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన  ఈ సినిమా రెండో భాగం అక్టోబర్‌ 20న కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక, ఈ సినిమాకు హేమంత్‌ రావ్‌ దర్శకత్వం వహించారు. చరణ్‌ రాజ్‌ సంగీతం సమకూర్చారు. మరి, ‘సప్త సాగదచ ఎల్లో’ తెలుగులోకి డబ్‌ అయి రిలీజ్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş