iDreamPost
android-app
ios-app

ఆ సినిమా కోసం సందీప్ కుటుంబం 36 ఎకరాలు అమ్మేసింది : ‘Animal’ నటుడు

  • Published Dec 20, 2023 | 8:53 PM Updated Updated Dec 21, 2023 | 12:11 PM

అసిస్టెంట్ డైరెక్టర్ నుండి దర్శకుడిగా మారేందుకు ఎవరో ఒకరు ఛాన్స్ ఇవ్వాలి. లేదంటే అక్కడే వారి కెరీర్ ముగిసిపోతుంది. సందీప్ రెడ్డి వంగా విషయంలో ఇదే జరగబోయేది. కానీ ఫ్యామిలీ చేసిన ఓ పని అతడిని సక్సెస్ ఫుల్ దర్శకుడిగా మార్చింది.

అసిస్టెంట్ డైరెక్టర్ నుండి దర్శకుడిగా మారేందుకు ఎవరో ఒకరు ఛాన్స్ ఇవ్వాలి. లేదంటే అక్కడే వారి కెరీర్ ముగిసిపోతుంది. సందీప్ రెడ్డి వంగా విషయంలో ఇదే జరగబోయేది. కానీ ఫ్యామిలీ చేసిన ఓ పని అతడిని సక్సెస్ ఫుల్ దర్శకుడిగా మార్చింది.

  • Published Dec 20, 2023 | 8:53 PMUpdated Dec 21, 2023 | 12:11 PM
ఆ సినిమా కోసం సందీప్ కుటుంబం 36 ఎకరాలు అమ్మేసింది : ‘Animal’ నటుడు

యానిమల్ సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. సినిమాపై నెగిటివిటీ వచ్చినా సక్సెస్ అందుకుంది. డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ ఇంకా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. అర్జున్ రెడ్డి,కబీర్ దాస్ చిత్రాలతో తనను తాను నిరూపించుకున్నసందీప్ రెడ్డి వంగా.. ఈ మూవీతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. ఈ మూవీ కలెక్షన్లను చూసి బిత్తర పోయింది బీటౌన్. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 850 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. రణ బీర్ కపూర్ చిత్రాల్లో భారీ వసూళ్లను రాబట్టిన మూవీగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సినిమా సక్సెస్‌ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇంత సక్సెస్ ఫుల్ దర్శకుడిగా సందీప్ రెడ్డి మారటానికి.. కుటుంబం ఓ త్యాగమే చేసింది.

సందీప్.. తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. డైరెక్టర్‌గా అవకాశాలు రాలేదు, ఇవ్వలేదు. దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. మోసపోయాడు. కానీ కుటుంబం ఈ విషయం తెలిసి అతడి కోసం తరతరాలుగా వస్తున్న 36 ఎకరాల భూమిని అమ్మేశారట. ఈ విషయాన్ని యానిమల్ నటుడు సిద్దాంత్ కర్నిక్ వెల్లడించాడు. ‘యానిమల్ షూటింగ్ సమయంలో సందీప్ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. సందీప్ సోదరుడు ప్రణయ్ నాతో చాలా విషయాలు పంచుకున్నాడు. అసిస్టెంట్ దర్శకుడిగా సందీప్ ఫిల్మ్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. దర్శకుడిగా మారేందుకు అవకాశాలు ఇవ్వకపోవడంతో తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు స్నేహితులతో కలిసి నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమా చేయాలనుకున్నారు’.

‘ఇక తొలి చిత్రం మొదలు అవుతుందనగానే.. డబ్బులిస్తామన్నోళ్లు.. ముఖం చాటేశారు. విషయం తెలుసుకున్న సందీప్ కుటుంబం ఆయనకు సపోర్ట్ చేసేందుకు ఊర్లో ఉన్న 36 ఎకరాల మామిడితోటను అమ్మేశారు. ఆడబ్బుతోనే సందీప్ తన తొలి చిత్రం అర్జున్ రెడ్డి తెరకెక్కించాడు. ప్రణయ్ ఈ విషయం చెప్పినప్పుడు నేనే షాక్ తిన్నా. సినిమా కోసం ఎవరూ ఇలాంటి సాహసం చేయరు’ అని సిద్దాంత్ కర్నిక్ చెప్పారు. అయితే గతంలో కూడా సందీప్ ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ఇక మూవీలో అందరికి పేరు వచ్చిందని చెప్పుకొచ్చారు సిద్దాంత్. సినిమాపై ఫ్యాషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన సందీప్..తన మూడు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. మరీ అతడి కోసం కుటుంబం ఎకరాల పొలాన్ని అమ్మేయడాన్ని ఏమంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş