iDreamPost
android-app
ios-app

Animal Movie:ఆ నటికి యానిమల్ డైరెక్టర్ క్షమాపణలు.. తప్పు నాదే వీలైతే క్షమించంటూ

  • Published Dec 27, 2023 | 12:29 PM Updated Updated Dec 27, 2023 | 12:29 PM

రీసెంట్ గా 'యానిమల్' సినిమా చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయమై.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

రీసెంట్ గా 'యానిమల్' సినిమా చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయమై.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

  • Published Dec 27, 2023 | 12:29 PMUpdated Dec 27, 2023 | 12:29 PM
Animal Movie:ఆ నటికి యానిమల్ డైరెక్టర్ క్షమాపణలు.. తప్పు నాదే వీలైతే క్షమించంటూ

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్దిరోజుల ముందు వరకు వినిపించిన ఒకే ఒక్క పేరు ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రంతో భారీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ చిత్రం ద్వారా సందీప్ తన మార్క్ ను సెట్ చేసుకున్నాడు. అంతే కాకుండా విమర్శలు కురిపించిన ప్రతి ఒక్కరికి ‘యానిమల్’ కలెక్షన్లతో.. దీనిపైన వచ్చిన భారీ రెస్పాన్స్ తో గట్టిగా సమాధానం చెప్పినట్టు అయింది. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన నటించిన సంగతి తెలిసిందే. అయితే, హీరోయిన్ గా రష్మికను సెలెక్ట్ చేసేకంటే ముందు సందీప్ దృష్టిలో.. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఉందట. ఈ విషయమై సందీప్ మాట్లాడుతూ పరిణీతి చోప్రాకు క్షమాపణ చెప్పాడు.

‘యానిమల్’ చిత్రంలో గీతాంజలి పాత్రలో రష్మిక నటించింది. ఈ చిత్రంలో రష్మిక నటనకు మంచి గుర్తింపు లభించింది. అయితే, సందీప్ యానిమల్ లో హీరోయిన్ గా మొదటిగా అనుకున్నది మాత్రం రష్మికను కాదు. సందీప్ ఫస్ట్ ఛాయస్ పరిణీతి చోప్రా. కానీ, కొన్ని కారణాల వలన ఆ ప్లేస్ రష్మికకు దక్కింది. గీతాంజలి పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ ను పరిణీతిలో చూడలేకపోయానని.. కొన్ని పాత్రలు కొందరికి మాత్రమే సూట్ అవుతాయని.. ఈ విషయాన్ని పరిణీతికి కూడా చెప్పడంతో.. ఆమె చాలా నిరాశ చెందింది, ఈ విషయంలో తప్పు నాదే కాబట్టి క్షమాపణ చెప్తున్నాను అంటూ సందీప్ ఇలా చెప్పారు..

my mistake forgive me

“బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా యాక్టింగ్ నాకు చాలా నచ్చుతుంది. నా సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ‘కబీర్ సింగ్’ సినిమాలో ప్రీతి క్యారెక్టర్ కు ఆమెనే సెలెక్ట్ చేయాలి అనుకున్నాను. కానీ, కొన్ని కారణాల వలన ఆమెను తీసుకోలేకపోయాను. ‘యానిమల్‌’ సినిమాలో కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకున్నప్పుడు చాలా సంతోషం కలిగింది. ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ఏడాది ముందే ఆమె అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసింది. అయితే, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఆమెను చూడాలేకపోయాను. ఇదే విషయాన్ని పరిణీతికి చెప్పాను. సినిమా విషయంలో రాజీ పడలేనని తెలియజేశాను. అందుకే, ఈ సినిమాలో మరో హీరోయిన్ ను తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాను. నేను అలా చెప్పడంతో ఆమె చాలా బాధపడింది. కానీ , నా అభిప్రాయాన్ని కూడా గౌరవించింది. నా మాటలను అర్థం చేసుకుంది” అని సందీప్ రెడ్డి వంగా చెప్పారు.

కాగా, ఇప్పటికే యానిమల్ చిత్రం ప్రేక్షకుల నుంచి భారీ క్రేజ్ సంపాదించింది. విడుదలైన కొద్ది రోజులకే కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్లను తన సొంతం చేసుకుంది. రణ్ బీర్ కపూర్, రష్మిక మందన, బాబీ డియోల్ ముఖ్య పాత్రలుగా పోషించి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. పైగా యానిమల్ చిత్రం సీక్వెన్స్ ‘యానిమల్ పార్క్’ అని కూడా దర్శకుడు ప్రకటించాడు. ఏదేమైనా, ఫస్ట్ పార్ట్ తోనే ఊహించని రెస్సాన్స్ సొంతం చేసుకున్న ‘యానిమల్’ .. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏ రేంజ్ ఉండబోతుందో వేచి చూడాలి. మరి, దర్శకుడు సందీప్ రెడ్డి పరిణీతి చోప్రా గురించి చేసిన వ్యాఖ్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş