iDreamPost
android-app
ios-app

అస్సలు నమ్మలేకపోయా.. ఆ హీరో కాల్ చేసి 40 నిమిషాలు మాట్లాడాడు: సందీప్ వంగా

  • Published Feb 05, 2024 | 9:44 PM Updated Updated Feb 05, 2024 | 9:44 PM

Sandeep Reddy Vanga: యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. రిలీజై రెండు నెలలు అయిపోయినా ఇంకా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.

Sandeep Reddy Vanga: యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. రిలీజై రెండు నెలలు అయిపోయినా ఇంకా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.

  • Published Feb 05, 2024 | 9:44 PMUpdated Feb 05, 2024 | 9:44 PM
అస్సలు నమ్మలేకపోయా.. ఆ హీరో కాల్ చేసి 40 నిమిషాలు మాట్లాడాడు: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఎంత వద్దనుకున్నా, ఎంత కాదనుకున్నా ఈ తెలుగు డైరెక్టర్ గురించి బాలీవుడ్ ఆడియన్స్ దగ్గరి నుంచి బీ టౌన్ ప్రముఖుల వరకు మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. ఎందుకంటే తన సినిమాలతో సందీప్ రెడ్డి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. సాధారణంగా అక్కడి వారు ఎదుగుతుంటేనే తట్టుకోలేని వాళ్లు బాలీవుడ్ లో ఉంటారని చాలానే వార్తలు విన్నాం. అలాంటి తెలుగువాడు వచ్చి కోట్లు కొల్లగొడుతుంటే కుళ్లుకోకుండా ఉంటారా? కానీ, కక్కలేక, సందీప్ రెడ్డి వంగా సక్సెస్ ని మింగలేక అల్లాడతున్నారు. అయితే కొందరు మాత్రం సందీప్ రెడ్డి టాలెంట్ పొగిడేస్తున్నారు. అయితే ఒకరు ఇచ్చిన రివ్యూ మాత్రం తనని ఆశ్చర్యానికి గురి చేసిందంటూ సందీప్ చెప్పుకొచ్చాడు.

యానిమల్ సినిమా మీద ఎన్నో రకాల రివ్యూలు వచ్చాయి. నిజానికి మీడియా మాత్రమే కాకుండా క్రిటిక్స్ కూడా యానిమల్ మూవీ అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. అలాగే పాన్ ఇండియా లెవల్లో ఉన్న ఫ్యాన్స్ అయితే మూవీ ఆఫ్ ది ఇయర్ అంటూ కామెంట్లతో హోరెత్తించారు. కొందరు నెగిటివ్ కామెంట్స్ చేయడం, వాటికి సందీప్ రెడ్డి వంగా స్వయంగా కౌంటర్స్ ఇవ్వడం కూడా చూశాం. అయితే ఒక హీరో ఇచ్చిన రివ్యూ మాత్రం సందీప్ రెడ్డి వంగాని సర్ ప్రైజ్ చేసిందంట. ఆ హీరో ఏకంగా ఫోన్ చేసి 40 నిమిషాలు మాట్లాడినట్లు సందీప్ చెప్పుకొచ్చాడు. ఆ హీరో మరెవరో కాదు రణ్ వీర్ సింగ్.

“రణ్ వీర్ సింగ్ నాకు ఫోన్ చేసి 40 నిమిషాలు మాట్లాడాడు. ఆ తర్వాత నాకు ఒక పెద్ద మెసేజ్ టైప్ చేసి పంపాడు. నేను ఆ మెసేజ్ ని నాలుగుసార్లు చదువుకున్నాను. యానిమల్ మూవీ గురించి చాలా విషయాలు రాశాడు. నాకే ఆశ్చర్యం వేసింది.. ఆ సినిమాలో అన్ని విశేషాలు ఉన్నాయా అని. చాలా ఆనందంగా అనిపించింది. యానిమల్ రిలీజ్ అయ్యాక కబీర్ సింగ్ కి కూడా రణ్ బీర్ నే పెట్టుకోవచ్చుగా అనే కామెంట్స్ వచ్చాయి. కబీర్ సింగ్ అనేది కంప్లీట్ రీమేక్ సినిమా. రణ్ బీర్ కపూర్ తాను రీమేక్ సినిమాలు చేయను అని ఎప్పుడో స్పష్టంగా చెప్పాడు. అందుకే ఆ ప్రాజెక్ట్ కి రణ్ బీర్ ని తీసుకోలేదు” అంటూ సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు.

మొత్తానికి తెలుగోడి సత్తా చాటటమే కాకుండా.. బాలీవుడ్ వాళ్లతో కూడా బ్రహ్మరథం పట్టించుకున్నాడు. ఈ మూవీ ఓటీటీలో కూడా టాప్ రెేటింగ్ తో దూసుకుపోతోంది. యానిమల్ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.900 కోట్లు వరకు గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక ఏ సర్టిఫికేట్ సినిమాగా వచ్చి ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తర్వాత వచ్చే యానిమల్ పార్క్ మరింత అద్భుతంగా ఉంటుందని సందీప్ హామీ ఇస్తున్నాడు. అందులో హీరో మరింత వైలెంట్ గా కనిపించబోతున్నాడు అని చెప్తున్నాడు. నిజానికి రణ్ బీర్ లుక్స్ కి యానిమల్ లోనే భయపడ్డారు. ఇంకా భయకరంగా అంటే గూస్ బంప్స్ వస్తాయేమో? మరి.. సందీప్ రెడ్డి వంగాకి రణ్ వీర్ సింగ్ కాల్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş