iDreamPost
android-app
ios-app

స్పిరిట్ పై అంచనాలు పెంచేస్తున్న సందీప్.. ఫస్ట్ డే 150 కోట్లు వస్తాయంటూ..

  • Published Apr 08, 2024 | 4:06 PM Updated Updated Apr 08, 2024 | 4:06 PM

Sandeep Reddy Vnaga On Prabhas Spirit: సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబినేషన్ లో సూపర్ కాప్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఈ యంగ్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Sandeep Reddy Vnaga On Prabhas Spirit: సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబినేషన్ లో సూపర్ కాప్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఈ యంగ్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Published Apr 08, 2024 | 4:06 PMUpdated Apr 08, 2024 | 4:06 PM
స్పిరిట్ పై అంచనాలు పెంచేస్తున్న సందీప్.. ఫస్ట్ డే 150 కోట్లు వస్తాయంటూ..

సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ లో ఉండే పేరు. తన కథ, స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టర్ ని చూపించే తీరు అన్నీ ఎంతో కొత్తగా ఉంటాయి. A సర్టిఫికేట్ సినిమాతో రూ.900 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన రికార్డు ఆయన సొంతం. అలాంటి డైరెక్టర్.. పాన్ వరల్డ్ హీరో ప్రభాస్ తో కలిసి సినిమా చేస్తున్నాడు అంటే బాక్సాఫీస్ బద్దలు అయిపోయినట్లే అని చెప్పాలి. పాన్ ఇండియాలో ఉన్న బాక్సాఫీస్ రికార్డులు అన్నీ గల్లంతు అవ్వాల్సిందే. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోందో స్వయంగా సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. సింపుల్ గా ఈ మూవీ ఫస్ట్ డేలో రూ.150 కోట్లు కలెక్ట్ చేస్తుందటూ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చేశాడు.

సందీప్ రెడ్డి వంగా టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి సందీప్ రెడ్డి టేకింగ్ అంటే పిచ్చి అని చెప్పాలి. ఈ యంగ్ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడు అనగానే పాన్ వరల్డ్ లెవల్లో ఆ మూవీపై అంచనాలు పెరిగాయి. పైగా ఇంతకాలం ప్రభాస్ చేయని పోలీస్ క్యారెక్టర్ లో ప్రభాస్ ని చూపించబోతున్నారు. ఈ మూవీ ఎలా ఉంటుందో అని ఎప్పటి నుంచో ఆడియన్స్ లో ఆసక్తి ఉంది. తాజాగా సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో స్పిరిట్ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాదాపు సినిమా స్టోరీ కూడా చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అన్నీ విషయాల గురించి కొన్ని లీకులు అయితే ఇచ్చాడు.

“స్పిరిట్ సినిమాలో ప్రభాస్ అన్న చాలా కొత్తగా కనిపిస్తాడు. ఇంతకాలం ఆయన చేసిన సినిమాలు ఒకెత్తు అయితే ఈ మూవీ ఒకెత్తు అని చెప్తాను. ఈ స్పిరిట్ లో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీలో ఆయన రియాక్షన్ చూస్తారు. అంటే ఆయనకు కావచ్చు, ఆయన పక్కన ఉండే వారికి కావచ్చు ఏదైనా జరిగితే ఎలా రియాక్ట్ అవుతాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చూపించబోతున్నాను. అయితే కథ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం నేను ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే కథ కేవలం 60 శాతం మాత్రమే పూర్తైయ్యింది. త్వరలో ఆ కథను పూర్తి చేయాల్సి ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ కి షూటింగ్ స్టార్ట్ చేయాలి. అప్పటికల్లా కథ పూర్తి చేస్తాను.

నేను గాల్లోకి ఎగరడం, దుమ్ము లేవడం అలాంటి ఫైట్స్ అయితే పెట్టకపోవచ్చు. కానీ, యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగానే ఉటుంది అనుకుంటున్నాను. కథ మొత్తం పూర్తయితే అర్థమవుతుంది. ఇది పాన్ ఇండియా సినిమా నిర్మాత రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ వాటితోనే ఈ మూవీకి సంబంధించి పెట్టుబడి వెనక్కి వస్తుంది అనుకుంటున్నాను. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.150 కోట్లు కలెక్ట్ చేస్తుందని నేను భావిస్తున్నాను. ఇది ట్రేడ్ ఐడియా ప్రకారం చెప్తున్నాను” అంటూ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీ కథ చెప్పడం, క్యారెక్టర్ చెప్పడం మాత్రమే కాకుండా.. స్పిరిట్ మూవీ తొలిరోజు రూ.150 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. మరి.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet