iDreamPost
android-app
ios-app

విడుదలకు ముందే 5 కోట్ల కారు గిఫ్ట్! ఇది యానిమల్ రేంజ్!

  • Published Nov 11, 2023 | 4:12 PM Updated Updated Nov 11, 2023 | 4:12 PM

రణ్ బీర్ కపూర్- రష్మికా మందన్నా జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే బీభత్సమైన హైప్ క్రియేట్ చేస్తోంది.

రణ్ బీర్ కపూర్- రష్మికా మందన్నా జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే బీభత్సమైన హైప్ క్రియేట్ చేస్తోంది.

  • Published Nov 11, 2023 | 4:12 PMUpdated Nov 11, 2023 | 4:12 PM
విడుదలకు ముందే 5 కోట్ల కారు గిఫ్ట్! ఇది యానిమల్ రేంజ్!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే.. సినిమా హిట్టు కొట్టి ప్రొడ్యూసర్ లాభాల బాట పట్టాడు అంటే డైరెక్టర్ కు ఖరీదైన వస్తువులు బహుమతులుగా ఇస్తున్నారు. లక్షల నుంచి కోట్లు విలువజేసే లగ్జరీ వాచెస్, లగ్జరీ కార్లను గిఫ్ట్ గా ఇస్తున్నారు. తెలుగులో ఇటీవలే బేబీ సినిమా సాధించిన విజయానికి గుర్తుగా డైరెక్టర్ సాయి రాజేశ్ కి నిర్మాత ఎస్కేఎన్ ఒక లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే జైలర్ సినిమా సృష్టించిన రికార్డులకు గుర్తుగా నిర్మాత కళానిధి మారన్ ఏకంగా హీరో, డెరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా లగ్జరీ కార్లు బహుమతులుగా ఇచ్చారు. ఇవన్నీ కూడా సినిమాలు రిలీజ్ అయ్యి హిట్టు కొట్టిన తర్వాత జరిగాయి. కానీ, ఇప్పుడు సినిమా రిలీజ్ కూడా కాకుండానే డైరెక్టర్ కు నిర్మాత ఏకంగా 5 కోట్ల కారు బహుమతిగా ఇచ్చారట.

సందీప్ రెడ్డి వంగా టాలెంట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ ప్రేక్షకులను ఎలా అయితే మాయ చేశాడో.. కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి ఒక డైరెక్టర్ కు రణ్ బీర్ కపూర్- రష్మికా మందన్నాలాంటి ఒక టాలెంటెండ్ జోడీ దొరికితే ఎలా ఉంటుంది? ఆ విషయం ఇప్పటికే యానిమల్ సినిమా టీజర్ తో ప్రేక్షకులకు అర్థమైపోయింది. సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో కూడా అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా కూడా మూవీ అంతకు మించే ఉంటుందని చెప్పచ్చు. అయితే ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వాటిని మరింతగా పెంచే ఒక న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ని షేక్ చేస్తోంది.

విషయం ఏంటంటే.. యానిమల్ సినిమా విడుదలకు ముందే.. సందీప్ వంగాకు నిర్మాత భూషణ్ కుమార్ రూ.5 కోట్ల విలువచేసే అత్యంత లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారంట. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ వార్త ఒక సెన్సేషన్ గా మారిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి బహుమతులు ఇస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, విడుదలకు ముందే ఇలాంటి కారు గిఫ్టుగా ఇవ్వడంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. కబీర్ సింగ్ తో సందీప్ వంగా స్టామినా ఏంటో భూషణ్ కుమార్ కు బాగా తెలుసింది. ఆ మూవీతో మంచి లాభాలు కూడా పొందారు. ఇప్పుడు యానిమల్ సినిమా రిలీజ్ కి ముందే.. కబీర్ సింగ్ మూవీకి లాభాలు అందించిందట. ఇంతటి భారీ హైప్ ఉన్న సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కనకవర్షం కురవక మానదు.

అలాగే సినిమా మీద ఉన్న గట్టి నమ్మకంతోనే భూషణ్ కుమార్ ఇప్పుడు సందీప్ వంగాకి ఇంతటి ఖరీదైనా కారుని గిఫ్ట్ గా ఇచ్చారని చెబుతున్నారు. ఇంక సినిమా విషయానికి వస్తే.. దీని నిడివి 3 గంటల 2 నిమిషాలు ఉండనుంది. అయితే చాలామంది ఇది మూవీకి ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉందని భావించారు. కానీ, సందీప్ చెప్పే నరేషన్ తో ఆ నిడివి పెద్ద సమస్య అవ్వదని టాక్ కూడా ఉంది. అంతేకాకుండా ఈ చిత్రంలో ఉండే యాక్షన్ సీక్వెన్స్ లకు ఫ్యాన్స్ ఫిదా కాకుండా ఉండలేరని బీ టౌన్ లో గట్టిగానే టాక్ నడుస్తోంది. ఇవన్నీ వర్కౌట్ అయ్యి యానిమల్ సినిమా సక్సెస్ అయితే ముఖ్యంగా సందీప్ వంగా రేంజ్ మరోస్థాయికి చేరుకోక మానదు. మరి.. సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి లగ్జరీ కారు గిఫ్ట్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş