iDreamPost
android-app
ios-app

స్పిరిట్ తర్వాతే యానిమల్ పార్క్.. క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

  • Published Feb 28, 2024 | 10:04 PM Updated Updated Feb 28, 2024 | 10:04 PM

Snadeep On Prabhas Spirit Movie: సందీప్ రెడ్డి వంగా పేరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతోంది. యానిమల్ చిత్రంతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు.

Snadeep On Prabhas Spirit Movie: సందీప్ రెడ్డి వంగా పేరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతోంది. యానిమల్ చిత్రంతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు.

  • Published Feb 28, 2024 | 10:04 PMUpdated Feb 28, 2024 | 10:04 PM
స్పిరిట్ తర్వాతే యానిమల్ పార్క్.. క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఈ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన విషయం తెలిసిందే. యానిమల్ అనే సినిమాతో వరల్డ్ వైడ్ గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బయటి వాడు వచ్చి బాలీవుడ్ లో కొట్టడం అంటే అంత ఆషామాషీ కాదు. కానీ, సందీప్ రెడ్డి వంగా అది చేసి చూపించాడు. అక్కడితో ఆగిపోకుండా.. బీ టౌన్ లో ఉండే రాజకీయాలను ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నాడు. కార్పొరేట్ బుకింగ్, కలెక్షన్స్ మ్యాజిక్ లకు సంబంధించి చాలానే ఓపెన్ కామెంట్స్ చేశాడు. ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం యానిమల్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఒక క్లారిటీ ఇచ్చేశాడు. 

సందీప్ రెడ్డి వంగా పేరు ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. చెప్పి కొట్టడం సందీప్ స్టైల్ అని ఇప్పటికే బాలీవుడ్ వాళ్లకు కూడా అర్థమైపోయి ఉంటుంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ కి గూబ గుయ్యమనేలా చేశాడు. అయితే సందీప్ రెడ్డి వంగా నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. యానిమల్ సినిమా సక్సెస్ ని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ, తర్వాతి సినిమా గురించి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సందీప్ వంగా తన తర్వాతి సినిమాపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశాడు.

తాజాగా ఓ హిందీ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ కు నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రశ్న ఎదురైంది. యానిమల్ పార్క్ సినిమా ఎప్పుడు రాబోతోంది అని అడగ్గా.. స్పిరిట్ సినిమా తర్వాతే యానిమల్ పార్క్ ఉంటుందని చెప్పింది. “నేను ప్రస్తుతం స్పిరిట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఆ మూవీలో ప్రభాస్ గారు పోలీసు క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు” అంటూ కుండ బద్దలు కొట్టేశాడు. ఇప్పటివరకు యానిమల్ పార్క్ రాబోతోంది స్పిరిట్ ఆలస్యం అవుతుందని అందరూ అనుకున్నారు. వార్తలు కూడా అలాగే వచ్చాయి. కానీ, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చేశాడు. తాను ప్రస్తుతం స్పిరిట్ చిత్రం మీదే వర్క్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంక పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. కల్కి సినిమాని మే 9న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టుల తర్వాత ప్రభాస్ సలార్ 2 సినిమా చేస్తాడా? స్పిరిట్ చేస్తాడా? అనే అనుమానాలు ఉండేవి. ఇప్పుడు సందీప్ ఇచ్చిన క్లారిటీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే స్పిరిట్ చిత్రంలో కెరీర్ లో తొలిసారిగా పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకే ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet