iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఒక్క మూవీతో ఇండియాని షేక్ చేసింది! కుర్రాళ్ళకి ప్రాణం ఈమె!

  • Published May 18, 2024 | 7:00 PM Updated Updated May 18, 2024 | 7:00 PM

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిపోయింది ఈ ఫోటోలోని చిన్నారి.. యూత్ గుండెల్లో గుడి కట్టేసుకుంది. కానీ స్టార్ స్టేటస్ చూడలేకపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ వైపు వంగి తొంగి చూడటం లేదు.

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిపోయింది ఈ ఫోటోలోని చిన్నారి.. యూత్ గుండెల్లో గుడి కట్టేసుకుంది. కానీ స్టార్ స్టేటస్ చూడలేకపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ వైపు వంగి తొంగి చూడటం లేదు.

  • Published May 18, 2024 | 7:00 PMUpdated May 18, 2024 | 7:00 PM
ఈ చిన్నారి ఒక్క మూవీతో ఇండియాని షేక్ చేసింది! కుర్రాళ్ళకి ప్రాణం ఈమె!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టాలెంట్స్ కొదవ లేదు. కొత్త కొత్త భామలు తమ లక్ పరీక్షించుకునేందుకు ఒక్కసారైనా తెలుగు సినిమా పరిశ్రమ తలుపులు తడుతుంటారు. మనస్సేమో బాలీవుడ్.. తనువేమో టాలీవుడ్ మీద ఉంటుంది. తమను తాము ప్రూవ్ చేసుకోవాలని తపన పడిపోతుంటారు. ఇక్కడ స్టార్ డమ్ చూశాక.. తిరిగి బీటౌన్ బాట పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ గూటి పక్షులన్నీ ఆ గూటికి చేరుతున్న సంగతి విదితమే. ఇక్కడ ఒక్కసారి క్లిక్ అయితే చాలు బాలీవుడ్‌కు ఫ్యూచర్‌లో ఫ్టైట్ బుక్ చేసుకున్నట్లే. అయితే వారు ఎక్కడ నుండి వచ్చామన్నది పట్టించుకోరు తెలుగు ప్రేక్షకులు. ఒక్కసారి ఇది మన పిల్లరా అనిపించుకుంటే చాలు గుండెల్లో గుడి కట్టేసుకుంటారు యూత్.

ఇదిగో ఈ ఫోటోలో చిన్నారి కూడా అలాగే కుర్రకారు హృదయాలను టచ్ చేసి.. బీటౌన్ చెక్కేసింది. ఒక్క సినిమా ఆమె లైఫ్ టర్న్ చేసింది. అది కూడా తొలి సినిమా కావడం విశేషం. ఇందులో ఓ బుడ్డోడు వెనుక బ్లూ తువ్వాలు కట్టుకుని నోట్లో వేలు పెట్టుకుని తదేకంగా చూస్తున్న ఈ పాప.. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్. కానీ గత కొద్దీ కాలంగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉంటుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. మన రౌడీ బాయ్‌తో ఇది నా పిల్లరా అనిపించుకున్న షాలిని పాండే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన తొలి మూవీ అర్జున్ రెడ్డితో కెరీర్ స్టార్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఈ జబల్ పూర్ బ్యూటీ.

విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డిలో మెరిసిన బ్యూటీ.. ఆ తర్వాత మహానటిలో సావిత్రి..స్నేహితురాలు సుశీల పాత్రలో మెరిచింది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో షావుకారు జానకిగా కనిపించింది షాలిని. కళ్యాణ్ రామ్ సరనస 118 అనే చిత్రంలో యాక్ట్ చేసింది. వచ్చిన తొలి నాళ్లలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ బొద్దుగుమ్మ.. ఆ తర్వాత కాలంలో ముద్దుగుమ్మగా మేకోవర్ అయ్యింది. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు సన్నగిల్లడంతో కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ 100 శాతం కాదల్ ( 100 పర్సెంట్ లవ్ తెలుగు రీమేక్), గొరిల్లా చిత్రాల్లో నటించింది. ఇద్దరి లోకం ఒకటే, నిశబ్దం తర్వాత ఆమె తెలుగులో కనిపించలేదు. 2922లో జయేష్ భాయ్ జోర్దార్ అనే హిందీ చిత్రంలో నటించింది. ప్రస్తుతం మహారాజా అనే మూవీ చేస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss