iDreamPost
android-app
ios-app

Sandeep Reddy Vanga: బాలీవుడ్‌ సినీ మాఫియాపై సందీప్‌ రెడ్డి వంగా సెన్సేషనల్‌ కామెంట్స్‌!

  • Published Dec 20, 2023 | 8:52 PM Updated Updated Dec 20, 2023 | 9:14 PM

బాలీవుడ్‌లో సందీప్‌ పేరు మారుమోగుతోంది. తీసిన రెండు సినిమాలతో స్టార్‌ డైరక్టర్లను సైతం వెనక్కునెట్టేశారు. క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయారు. దీంతో బాలీవుడ్‌లోని ఓ వర్గం కుళ్లుకుంటోంది.

బాలీవుడ్‌లో సందీప్‌ పేరు మారుమోగుతోంది. తీసిన రెండు సినిమాలతో స్టార్‌ డైరక్టర్లను సైతం వెనక్కునెట్టేశారు. క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయారు. దీంతో బాలీవుడ్‌లోని ఓ వర్గం కుళ్లుకుంటోంది.

  • Published Dec 20, 2023 | 8:52 PMUpdated Dec 20, 2023 | 9:14 PM
Sandeep Reddy Vanga: బాలీవుడ్‌ సినీ మాఫియాపై సందీప్‌ రెడ్డి వంగా సెన్సేషనల్‌ కామెంట్స్‌!

యానిమల్‌ సినిమాతో దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేశారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. మరోసారి బాలీవుడ్‌లో తెలుగోడి సత్తా ఏంటో చూపించారు. యానిమల్‌ మూవీ ఇప్పటి వరకు 800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతోంది. ఓవర్‌సీస్‌లో కొన్ని చోట్ల పాత రికార్డులు తుడిచిపెట్టింది. బహుబలి రికార్డులను సైతం పక్కకు నెట్టేసింది. యానిమల్‌ మూవీని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన సందీప్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కానీ, బాలీవుడ్‌లోని ఓ వర్గం మాత్రం సందీప్‌ సాధించిన విజయాన్ని చూసి ఓర్వలేకపోతోందట. యానిమల్‌ మూవీపై తప్పుడు ప్రచారానికి సైతం దిగిందట. తప్పుడు రివ్యూలు సైతం రాయించిందట. ఈ విషయంపై తాజాగా, సందీప్‌ స్పందించారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ..  ‘‘ దాదాపు ఐదేళ్లుగా ముంబైలో ఉంటున్నా. ఈ ఐదేళ్లలో నాకో విషయం బాగా అర్థం అయింది. అక్కడో గ్యాంగ్‌ ఉంది. వాళ్లు కేవలం కొన్ని రకాల సినిమాలను మాత్రమే ఇష్టపడతారు.

వాళ్లు కేవలం అలాంటి సినిమాలు తీసే దర్శకులను మాత్రమే ఇష్టపడతారు. క్రిటిక్స్‌కు, రివ్యూవర్లకు డబ్బులు ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది’’ అని అన్నారు. డబ్బులు ఇచ్చి తప్పుడు రివ్యూలు రాయిస్తారని చెప్పకనే చెప్పారు. అనుప‌మ చోప్రా, రాజీవ్ మ‌సంద్, సుచిత్ర త్యాగి లాంటి బాలీవుడ్‌ క్రిటిక్స్ సినిమాలపై అవగాహన లేకుండానే రివ్యూలు రాస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. సినిమాలు ఎలా చూడాలో తెలియని వాళ్లు కూడా సినిమాలు చూసి రివ్యూలు రాస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మూవీ అర్థం కాకపోతే బ్యాడ్‌ రివ్యూలు ఇస్తున్నారని తెలిపారు. అర్జున్‌ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగిందని అన్నారు. డబ్బులు ఇచ్చి ఎప్పుడూ రివ్యూలు కొనుక్కోలేదని స్పష్టం చేశారు. ఇక, యానిమల్‌ విడుదల అయిన తర్వాత కొన్ని వీడియోలు వైరల్‌ అయ్యాయి. సందీప్‌ రెడ్డి మంచి కథతో హిట్టు కొట్టే దమ్ము లేక, రక్తపాతాన్ని ఎంచుకున్నాడంటూ ఆ వీడియోల్లో ఉంది. అంతేకాదు.. సందీప్‌ తన చిత్రాల్లో ఆడవాళ్లను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని కూడా బాలీవుడ్‌లోని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి.

కాగా, యానిమల్‌ సినిమా డిసెంబర్‌ 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యానిమల్‌లో రణబీర్‌ కపూర్‌కు జంటగా రష్మిక మందన్నా నటించారు. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, పృథ్వీరాజ్‌లు కీలక పాత్రలు చేశారు. మరి, బాలీవుడ్‌ రివ్యూవర్లపై సందీప్‌ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibom