iDreamPost
android-app
ios-app

స్పిరిట్- యానిమల్ పార్క్ పై సందీప్ రెడ్డి వంగా క్లారిటీ.. రిలీజ్ కూడా చెప్పేశాడు!

  • Published Aug 26, 2024 | 4:24 PM Updated Updated Aug 26, 2024 | 4:24 PM

Sandeep Reddy Vanga On Spirit And Animal Park: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ తో స్పిరిట్, రణబీర్ కపూర్ తో యానిమల్ పార్క్ కి సంబంధించి కీలక విషయాలు వెల్లడించాడు.

Sandeep Reddy Vanga On Spirit And Animal Park: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ తో స్పిరిట్, రణబీర్ కపూర్ తో యానిమల్ పార్క్ కి సంబంధించి కీలక విషయాలు వెల్లడించాడు.

  • Published Aug 26, 2024 | 4:24 PMUpdated Aug 26, 2024 | 4:24 PM
స్పిరిట్- యానిమల్ పార్క్ పై సందీప్ రెడ్డి వంగా క్లారిటీ.. రిలీజ్ కూడా చెప్పేశాడు!

సందీప్ రెడ్డి వంగా.. ఈయన పేరు ఇండియన్ సినిమాలో ఒక పెను సంచలనం. బాలీవుడ్ లో కొన్నేళ్ల నుంచి పాతుకుపోయిన హేమాహేమీలను కూడా గడగడ వణికించాడు. సినిమాలతోనే కాదు.. మాటలతో కూడా సందీప్ రెడ్డి వంగా కౌంటర్లు ఇవ్వగలడు. ఇప్పటికీ బాలీవుడ్ వాళ్లు సందీప్ ని కదిలించి రక్త కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగా తన నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ఏ సినిమా ఎప్పుడు రాబోతోంది? ప్రభాస్ తో స్పిరిట్, రణబీర్ కపూర్ తో యానిమల్ పార్క్ ఎప్పుడు తీస్తాడు? అనే ప్రశ్నలు తరచూ వినిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రశ్నలకు తాజాగా ఈ బ్లాస్టింగ్ డైరెక్టర్ బదులు ఇచ్చాడు. తన తర్వాతి 4 ఏళ్లు ఫుల్ బిజీగా గడనపోతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించింది కేవలం మూడు చిత్రాలు. వాటిలో కబీర్ సింగ్.. అర్జున్ రెడ్డికి రీమేక్. కానీ ఈ యంగ్ డైరెక్టర్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా లెవల్లో సందీప్ రెడ్డి వంగా సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఈ డైరెక్టర్ కూడా తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని రెడీ చేసుకున్నాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దగ్గర ఇద్దరు హీరోలు ఉన్నారు. వారిలో ఒక డార్లింగ్ ప్రభాస్. ఈయనతో స్పిరిట్ చిత్రాలన్ని సందీప్ తెరకెక్కించనున్నాడు. ఇందులో తొలిసారి ప్రభాస్ ఒక పోలీసు అధికారిగా కనిపించబోతున్నాడు. ఇంక రెండో హీరో రణబీర్ కపూర్. ఇప్పటికే యానిమల్ సినిమాతో క్రేజీ రికార్డులు క్రియేట్ చేసి యానిమల్ పార్క్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలకి సంబంధించి సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చాడు. తాను రాబోయే నాలుగేల్లు ఫుల్ బిజీగా గడపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభాస్ తో స్పిరిట్ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు చెప్పాడు. అలాగే ఈ సినిమాని వచ్చే రెండేళ్లలో పూర్తిచేసి రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. అంటే 2026లో స్పిరిట్ చిత్రం విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. ఇంక యానిమల్ పార్ట్ విషయానికి వస్తే.. ఆ మూవీని స్పిరిట్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తాను అన్నాడు. అంటే ఈలోపు రణబీర్ కపూర్ రామాయణం సినిమాతో బిజీగా ఉంటాడు. కాబట్టి రెండేళ్ల తర్వాత యానిమల్ పార్క్ ని సెట్స్ మీదకు తీసుకెళ్తాడు. అది కనీసం ఒక రెండేళ్లు షూటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా 2028 వరకు యానిమల్ పార్క్ గురించి మాట్లాడే అవకాశం లేదు. ఇప్పటికే సందీప్ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, అంత ఈజీగా సినిమాలు అయితే విడుదల కావు కాబట్టి స్పిరిట్ కోసం ఇంకో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişasyabahis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom