iDreamPost
android-app
ios-app

స్పిరిట్ తో పాటు యానిమల్ పార్క్ కూడా.. ఒకేసారి?

  • Published Nov 12, 2024 | 2:54 PM Updated Updated Nov 12, 2024 | 2:54 PM

sandeep reddy vanga: ఇప్పుడు స్పిరిట్ సినిమాతో పాటుగా సందీప్ చేయబోయే యానిమల్ 2 గురించి కూడా టాక్ నడుస్తుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో యానిమల్ మూవీని నిర్మించిన భూషణ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

sandeep reddy vanga: ఇప్పుడు స్పిరిట్ సినిమాతో పాటుగా సందీప్ చేయబోయే యానిమల్ 2 గురించి కూడా టాక్ నడుస్తుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో యానిమల్ మూవీని నిర్మించిన భూషణ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Nov 12, 2024 | 2:54 PMUpdated Nov 12, 2024 | 2:54 PM
స్పిరిట్ తో పాటు యానిమల్ పార్క్ కూడా.. ఒకేసారి?

ప్రభాస్ అప్ కమింగ్ సినిమాల లిస్ట్ లో స్పిరిట్ సినిమా ఒకటి. ఈ సినిమా కోసం సందీప్ చాలా భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు డిసెంబర్ లో స్పిరిట్ ను సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాతో పాటు.. హనురాఘవపుడి తో ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాటలతో పాటే ప్రభాస్ స్పిరిట్ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్లు అయింది. కానీ.. ప్రభాస్ మిగిలిన సినిమాలతో బిజీగా ఉండడం , సందీప్ యానిమల్ తో బిజీ గా ఉండడం వలన ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. ప్రస్తుతం సందీప్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. దాదాపు అది కూడా పూర్తి కావొచ్చిందని టాక్. టి సిరీస్ బ్యానర్ లో భూషణ్ కుమార్ స్పిరిట్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా మీద రకరకాల అప్డేట్స్ వినిపిస్తూ ఉన్నాయి.

ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాతో పాటుగా సందీప్ చేయబోయే యానిమల్ 2 గురించి కూడా టాక్ నడుస్తుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో యానిమల్ మూవీని నిర్మించిన భూషణ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. సందీప్ సినిమాలు తీసే విషయంలో అంత హడావిడి అయితే పడడు. చాలా నీట్ గా క్లియర్ గా వర్క్ ఫినిష్ చేయాలనీ చూస్తూ ఉంటాడు. మరి ప్రభాస్ తో సినిమా అంటే ఇంకాస్త టైం ఎక్కువే తీసుకుంటాడన్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాతో పాటుగా సందీప్ యానిమల్ పార్క్ ను ఎప్పుడు ఫినిష్ చేస్తాడు అనే సందేహాలు మొదలయ్యాయి. డిసెంబర్ చివర్లో స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని.. ఆ తర్వాత ఆరు నెలల్లోనే యానిమల్ పార్క్ ను స్టార్ట్ చేస్తారని సమాచారం. ఈ లెక్కన చూస్తే సందీప్ రెండు సినిమాలను కొద్దీ రోజుల వ్యవధిలోనే తెరకెక్కిస్తారని అర్ధమౌతుంది.

అర్జున్ రెడ్డి నుంచి స్టార్ట్ చేస్తే సందీప్ చేసిన అన్ని సినిమాలు.. స్క్రిప్ట్ వర్క్ కి ఎక్కువ టైం తీసుకుని.. ప్రీ ప్రొడక్షన్ కు చాలా తక్కువ సమయం తీసుకుంటాడు. యానిమల్ మేకింగ్ విషయంలోను ఇదే జరిగింది. కానీ ప్రభాస్ తో మూవీ అంటే లేట్ అవుతుందని అందరికి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ కి ఉన్న కమిట్మెంట్స్ కు ఏ సినిమా ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఎవరికీ అర్థంకావడం లేదు. అందుకే సందీప్ కూడా స్పిరిట్ తో పాటే యానిమల్ ను కూడా కంప్లీట్ చేస్తాడని సమాచారం. మరో వైపు రణ్ బీర్ కూడా రామాయణంతో బిజీ గా ఉన్నాడు. మరి ఈ గ్యాప్ లో సందీప్ యానిమల్ కోసం ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. అసలే యానిమల్ మూవీ బాలీవుడ్ లో అందరిని మెస్మరైజ్ చేసింది. అందుకే యానిమల్ పార్క్ ను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడట సందీప్. ప్రభాస్ డేట్స్ అందుబాటులో లేని టైం లో యానిమల్ పార్క్ ను సందీప్ రెడ్డి చేస్తాడని తెలుస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique