iDreamPost
android-app
ios-app

సందీప్- అమీర్ ఖాన్ మాజీ భార్య మధ్య ముదురుతున్న వివాదం!

  • Published Feb 06, 2024 | 1:36 PM Updated Updated Feb 06, 2024 | 3:13 PM

ఇటీవలే దర్శకుడు సందీప్ రెడ్డి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కిరణ్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేమిటంటే..

ఇటీవలే దర్శకుడు సందీప్ రెడ్డి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కిరణ్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేమిటంటే..

  • Published Feb 06, 2024 | 1:36 PMUpdated Feb 06, 2024 | 3:13 PM
సందీప్- అమీర్ ఖాన్ మాజీ భార్య మధ్య ముదురుతున్న వివాదం!

సినీ ఇండస్ట్రీలో విమర్శలు, ప్రశంసలు అనేవి కామన్. ఏదైనా ఒక  సినిమా కొంచెం కాంట్రవర్సీగా ఉంటే చాలు ఇక దాని పై తార స్థాయిలో విమర్శలనేవి గుప్పుమంటాయి.మరి, అలాంటి విమర్శలు, వివాదాలతో సంచలనం సృష్టించిన సినిమా ‘యానిమల్’. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మీక మందన హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది. ఈ క్రమంలోనే ఏకాంగా రూ.900 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అలారిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవలే ఈ సినిమా పై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, దీనిపై స్పందించిన దర్శకుడు సందీప్ తనదైన స్టైల్ లో కౌంటర్ వేశాడు. అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కిరణ్ రావు పరోక్షంగా ఆయన పై మళ్లీ కామెంట్స్ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే డైరెక్టర్ సందీప్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. తన సినిమాల గురించి మాట్లాడే ముందు తన మాజీ భర్త అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమాను ఓసారి చూడాలని అన్నారు. అలాగే ఖంబే జైసీ ఖాదీ హై వంటి పాటలు ఉన్న అమీర్ ఖాన్ చిత్రాలను చూసిన తర్వాత తన సినిమాలపై కామెంట్స్ చేయాలని ఆయన సూచించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కిరణ్ రావు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ ఆమె సందీప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. యానిమల్ సినిమాను అసలు తాను చూడలేదని, కేవలం తాను సినిమాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి మాట్లాడనని అన్నారు.

అలాగే ‘నేను మహిళల ప్రాతినిధ్యం గురించి అనేక వేదికల్లో.. చాలా సమయాల్లో మాట్లాడాను. కానీ, నేను ఏ సినిమా పేరును కూడా ప్రస్తావించలేదు. ఇది నిజంగా ఒక సినిమా గురించి అయితే కాదు, చాలా సినిమాల్లో స్త్రీల సమస్యలపై మాట్లాడాను. అయితే సందీప్ అన్నట్లుగా తన సినిమాపై నేను ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ, ఆయనను అన్నట్లు ఎందుకు భ్రమ పడ్డారో తెలియడం లేదు. నేను ఇప్పటి వరకు ఆయన సినిమాలు కూడా చూడలేదు. అయిన సందీప్ నా మాటలపై ఎందుకు రియాక్ట్ అయ్యాడో మీరు అతడిని అడగాలి. పైగా ఆయన పేరును, సినిమా పేరును నేను ఎక్కడ తీసుకోరాలేదు’ అని అన్నారు.

ఇక సందీప్ రెడ్డి మాట్లాడిన ఖంబే జైసీ ఖాదీ హై పాటకు గతంలో అమీర్ ఖాన్ క్షమాపణలు చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు. అలాంటి వివాదాస్పద చిత్రాలు పాటలు చిత్రీకరించిన తర్వాత.. క్షమాపణలు చెప్పిన వారిలో అమీర్ కూడా ఒకరు అని అన్నారు. అమీర్ ఖాన్ సినిమాల గురించి నాతో కాకుండా.. ఆయనతో నేరుగా మాట్లాడాలని సందీప్ కు రిక్వెస్ట్ చేస్తున్నాని అన్నారు. ప్రస్తుతం కిరణ్ రావు చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. మరి, దర్శకుడు సందీప్ కౌంటర్స్ కు కిరణ్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin