iDreamPost
android-app
ios-app

స్టార్ హీరో ప్రయాణిస్తున్న విమానానికి తప్పిన ప్రమాదం

  • Published Feb 20, 2024 | 11:21 AM Updated Updated Feb 20, 2024 | 11:23 AM

విమాన ప్రయాణంలో సినీ సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురైన సంగతి విదితమే. వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు సదరు స్టార్స్. తాజాగా స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ ప్రయాణిస్తున్న విమానం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇప్పుడు ప్రముఖ హీరో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు.

విమాన ప్రయాణంలో సినీ సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురైన సంగతి విదితమే. వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు సదరు స్టార్స్. తాజాగా స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ ప్రయాణిస్తున్న విమానం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇప్పుడు ప్రముఖ హీరో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు.

  • Published Feb 20, 2024 | 11:21 AMUpdated Feb 20, 2024 | 11:23 AM
స్టార్ హీరో ప్రయాణిస్తున్న విమానానికి తప్పిన ప్రమాదం

శాండిల్ వుడ్ ప్రముఖ నటుడు ధ్రువ సర్జాకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదం నుండి తప్పించుకుంది. ధ్రువ సర్జాతో సహా ప్రయాణీకులంతా సేఫ్ ల్యాండ్ అయ్యారు. విమానంలో ఒక్కసారి సాంకేతిక సమస్య తలెత్తడంతో కొంత అనిశ్చితి నెలకొంది. ఎట్టకేలకు పైలట్ సమయ స్పూర్తితో వ్యవహరించి.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మార్టిన్ చిత్రీకరణలో భాగంగా ఓ పాట షూట్ చేసేందుకు శ్రీనగర్‌కు వెళ్లింది చిత్ర బృందం. అనంతరం బెంగళూరుకు వచ్చేందుకు ఇండిగో విమానంలో బయలుదేరింది. అప్పటికప్పుడే చోటుచేసుకున్న సాంకేతిక సమస్యలు కారణంగా పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేయలేకపోయాడు.

ఈ ఘటనతో చిత్ర బృందంతో సహా విమానంలోని ప్రయాణీకులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తమ సీట్లలో కూర్చుని ఆందోళన చెందుతున్నారు. అంతలో పైలట్ సమయస్పూర్తి ప్రదర్శించి.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో మార్టిన్ చిత్ర యూనిట్‌తో సహా ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం నుండి బయట పడిన తర్వాత ధృవ సర్జా మాట్లాడుతూ..‘ నా జీవితంలో అత్యంత దారుణమైన అనుభవాన్ని ఈ విమాన ప్రయాణంలో ఎదుర్కొన్నాను. ధ్యాంక్స్ గాడ్ శ్రీ ఆంజనేయ’ అన్నారు. ఈ వీడియోలో దర్శకుడు ఏపీ అర్జున్, నటి అన్వేషి జైన్, కొరియోగ్రాఫర్ ఇమ్రాన్ సర్దారియా సహా 15 మందికి పైగా ఉన్నారు.

ప్రమాదం నుండి బయటపడిన ఆనందలో జై శ్రీరామ్, జై ఆంజనేయ నినాదాలు చేశారు చిత్ర యూనిట్. కాగా, ధృవ సర్జా ఈ ఘటన ఎదుర్కొన్న అనుభవాన్ని పోస్టు చేశారు. కాగా, గత వారం కూడా ప్రముఖ నటి, నేషనల్ క్రష్ రష్మిక కూడా విమాన ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. మరణం అంచుల దాకా వెళ్లి బయటకు వచ్చినట్లు తెలిపింది. అదే విమానంలో నటి శ్రద్ధాదాస్ కూడా ప్రయాణిస్తోంది. రష్మిక ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక మార్టిన్ సినిమా విషయానికి వస్తే..  ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ధృవ సర్జా, వైభవి శాండిల్య, అన్వేషి జైన్, చిక్కన్న, మాళవిక అవినాష్, అచ్యుత్ కుమార్, నవాబ్ షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధ్రువ సర్జా… ప్రముఖ సీనియర్ నటుడు అర్జున్ కు మేనల్లుడు.  ఇక ఆయన సోదరుడు చిరంజీవి సర్జా కరోనా సమయంలో గుండె పోటుతో మరణించిన సంగతి విదితమే.

 

View this post on Instagram

 

A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa)

 

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom