గ్యాప్ తీసుకొని రీమేక్ ని నమ్ముకున్న సంపూర్ణేష్ బాబు! మార్టిన్ లూథర్ కింగ్ గా..

  • Author Soma Sekhar Published - 01:10 PM, Tue - 19 September 23
  • Author Soma Sekhar Published - 01:10 PM, Tue - 19 September 23
గ్యాప్ తీసుకొని రీమేక్ ని నమ్ముకున్న సంపూర్ణేష్ బాబు! మార్టిన్ లూథర్ కింగ్ గా..

ఇండస్ట్రీలో ఎంతపెద్ద నటీ, నటులకైనా.. ఒకానొక సందర్భంలో గ్యాప్ అనేది వస్తుంది. అనివార్య కారణాల వల్లనో లేక అవకాశాలు రాకనో ఈ గ్యాప్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు నుంచి సినిమా వచ్చి చాలా రోజులే అయ్యింది. హృదయకాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. స్పూఫ్ కామెడీ మూవీలతో కమర్షియల్ గా సక్సెస్ అయ్యాడు సంపూర్ణేష్ బాబు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం విజయాల్ని అందుకోవడంలో విఫలం అయ్యాయనే చెప్పాలి. కాగా.. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు ఈ కామెడీ హీరో. ఏకంగా రెండు నేషనల్ అవార్డులు గెలుచుకున్న తమిళ సినిమాకు ఈ మూవీ రీమేక్ అని తెలుస్తోంది.

సంపూర్ణేష్ బాబు.. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలతో పరిశ్రమలో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత చాలా సినిమాలే చేసినప్పటికీ.. అవి ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే లాంగ్ గ్యాప్ తర్వాత సంపూర్ణేష్ బాబు నుంచి ఓ చిత్రం వస్తోంది. ఇందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. మార్టిన్ లూథర్ కింగ్ గా టైటిల్ రోల్ పోషిస్తున్నాడు సంపూ. ఇక ఈ మూవీలో డైరెక్టర్ వెంకటేష్ మాహా, నరేష్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీని అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్టిన్ లూథర్ కింగ్ మూవీకి పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘మండేలా’ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. మండేలా సినిమా ఆధారంగానే సంపూర్ణేష్ బాబు నటిస్తున్న మార్టిన్ లూథర్ కింగ్ చిత్రం రూపొందినట్లు సమాచారం. మండేలా చిత్రంలో కమెడియన్ యోగిబాబు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి రెండు నేషనల్ అవార్డ్స్ తో పాటుగా.. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఇండియా నుంచి షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా మండేలా నిలిచింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత రీమేక్ ను నమ్ముకుని వస్తున్న సంపూర్ణేష్ బాబు విజయం సాధిస్తాడో? లేడో? తెలియాలంటే సినిమా విడుదల దాకా ఆగాల్సిందే.

Show comments