iDreamPost
android-app
ios-app

గడ్డ కట్టే చలిలో.. సమంత కఠిన ట్రీట్ మెంట్! పోస్ట్ వైరల్..

  • Author Soma Sekhar Published - 06:16 PM, Sat - 4 November 23

సమంత మయోసైటిస్ చికిత్స లో భాగంగా.. క్రయోథెరపీ అనే కఠినమైన ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి తాజాగా సామ్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

సమంత మయోసైటిస్ చికిత్స లో భాగంగా.. క్రయోథెరపీ అనే కఠినమైన ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి తాజాగా సామ్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Published - 06:16 PM, Sat - 4 November 23
గడ్డ కట్టే చలిలో.. సమంత కఠిన ట్రీట్ మెంట్! పోస్ట్ వైరల్..

సమంత.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఒకప్పుడు తీరికలేకుండా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ.. నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. ఇదంతా గతం.. ప్రస్తుతం సామ్ పరిస్థితి దారుణంగా ఉంది. గత కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ.. చికిత్స తీసుకుంటూ వస్తోంది. ఈ వ్యాధి బారినపడిన సమయంలోనే శాకుంతలం, ఖుషి సినిమాలను కంప్లీట్ చేసి.. ఆ తర్వాత మూవీలకు కాస్త విరామం తీసుకుంది. ఈ టైమ్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ.. అందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా మరోసారి తన ట్రీట్ మెంట్ కు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసి.. అందరిని షాక్ కు గురిచేసింది.

మయోసైటిస్ అనే ఇమ్యూనిటీ వ్యాధితో బాధపడుతోంది హీరోయిన్ సమంత. ఇక ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే శాకుంతలం, ఖుషి సినిమాలను కంప్లీట్ చేసింది. అనంతరం మూవీలకు బ్రేకి ఇచ్చింది. ఈ సమయాన్ని తన ట్రీట్ మెంట్ కు వినియోగించుకుంటోంది ఈ బ్యూటీ. తాజాగా తన ట్రీట్ మెంట్ లో భాగంగా సామ్ షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత మయోసైటిస్ చికిత్స లో భాగంగా.. క్రయోథెరపీ అనే కఠినమైన ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. పొగలు కక్కే -150 డిగ్రీల ఫారెన్ హీట్ లోని ఓ టబ్ లో కూర్చుని ఉంది సామ్. ఇక ఈ థెరపీ గురించి ఈ విధంగా రాసుకొచ్చింది.

“ఈ చికిత్స రోగనిరోధక శక్తిని పెంచడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, హార్మోన్లను ప్రేరేపించడానికి సహాయం చేస్తుంది. కొంతకాలం శరీరాన్ని చల్లని వాతావారణంలో ఉండేలా చేయాలి” అంటూ ఈ థెరపీ గురించి వివరించింది. దీంతో ఈ పోస్ట్ చూసిన అభిమానులు సమంతకు ఎంత కష్టం వచ్చిందని, ఇంత కఠినమైన ట్రీట్ మెంట్ ను సామ్ ఎలా భరిస్తుందని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సామ్ ది మార్వెల్స్ ప్రమోషన్ ఈవెంట్ లో కనిపించి సందడి చేసింది. మరి సామ్ ఇంత కష్టమైన ట్రీట్ మెంట్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom