iDreamPost
android-app
ios-app

క్లియర్ మెసేజ్ ఇచ్చిన సమంత.. ఇకపై విజృంభిస్తాను అంటూ..

  • Published Mar 23, 2024 | 10:11 PM Updated Updated Mar 23, 2024 | 10:11 PM

Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో ఉంది. అలాగే ఫొటో షూట్స్ తో కూడా ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తూ ఉంది.

Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో ఉంది. అలాగే ఫొటో షూట్స్ తో కూడా ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తూ ఉంది.

  • Published Mar 23, 2024 | 10:11 PMUpdated Mar 23, 2024 | 10:11 PM
క్లియర్ మెసేజ్ ఇచ్చిన సమంత.. ఇకపై విజృంభిస్తాను అంటూ..

స్టార్ హీరోయిన్ సమంత గురించి పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి ఇంట్రడక్షన్లు అక్కర్లేదు. ఇప్పటికే తన యాక్టింగ్ తో దేశవ్యాప్తంగా, అన్ని భాషల్లో అభిమానులను సొంతం చేసుకుంది. కెరీర్ ప్రారంభం నుంచి ఈ అమ్మడు పెద్దగా వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. 2010లో ఏమాయ చేశావే అంటూ వచ్చి.. 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతోంది. ఈ భామ ఒక్క తెలుగు, తమిళ్ లోనే కాకుండా.. హిందీలో కూడా తన మార్క్ చూపిస్తోంది. సినిమాలు మాత్రమే కాకుండా.. టాక్ షోలు, వెబ్ సిరీస్లు కూడా చేసింది. ఇప్పుడు సిటాడెల్ ఇండియన్ వర్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సమంతకు పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఉన్నారు. ఆమెకు కేవలం ఇన్ స్టాగ్రామ్ లోనే 33.6 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఒక చిన్న హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన సమంత ఇప్పుడు ఇండియాలోనే లీడింగ్ అండ్ మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతోంది. తాను ఏదైతో కోరుకుందో తన కెరీర్ ని అలా మలుచుకుంటూ సమంత ఎదుగుతూ వచ్చింది. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా సమంత తన సత్తా చాటింది. పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీ మ్యాన్ సిరీస్.. సీజన్ 2లో సమంత కీలక పాత్ర పోషించింది.

ఆ తర్వతా ఇప్పుడు సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హాలీవుడ్ వర్షన్ లో ప్రియాంక చోప్రా ప్లే చేసిన క్యారెక్టర్ ని ఇండియన్ వర్షన్ లో సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కి సంబంధించి సమంత- వరుణ్ ధావన్ ఇటీవల జరిగిన అమెజాన్ ఈవెంట్ లో ప్రమోషన్స్ చేశారు. ప్రస్తుతం అందరి దృష్టి ఈ సిరీస్ మీదే ఉంది. సమంతకు హీరోయిన్ గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ గా సమంత ఎప్పుడూ తన ఫాలోవర్స్ కి మంచి చెప్పాలనే చూస్తూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఎక్కువగా జిమ్ వీడియోస్ తో ఫిట్ గా ఉండండి అని మోటివేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఫుడ్ కి సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తూ ఉంటుంది. ఇంక తన పెట్స్ తో తాను గడిపే హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల సమంత కెరీర్ కొంచం స్లో అయిన విషయం తెలిసిందే. తనకు ఉన్న హెల్త్ ఇష్యూని ఓవర్ కమ్ చేసేందుకు కెరీర్ లో కొంత బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు సమంత చేసిన పోస్ట్ కెరీర్ లో తాను మళ్లీ దూకుడు పెంచబోతున్నాను అని క్లియర్ మెసేజ్ ఇచ్చేలా ఉంది. విషయం ఏంటంటే.. సమంత తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఎంతో స్టైలిష్ గా ఉంది. అయితే ఆ ఫొటోలకు పెట్టిన క్యాప్షన్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. క్యాప్షన్ ఏం పెట్టిందంటే.. “డిస్నీ ప్రిసెస్ లా నేను ఫెయిల్ అయ్యాను.. నేను ఇప్పుడు డ్రాగన్” అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇది సరదాగా పెట్టి ఉండచ్చు. కానీ, ఇకపై విజృంభించబోతున్నాను అని మెసేజ్ ఇచ్చినట్లే ఉంది. మరి.. సమంత మెసేజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom