iDreamPost
android-app
ios-app

25 కోట్ల పుకార్లపై స్పందించిన సమంత.. ఇచ్చి పడేసింది!

  • Published Aug 05, 2023 | 2:38 PM Updated Updated Aug 05, 2023 | 2:38 PM
  • Published Aug 05, 2023 | 2:38 PMUpdated Aug 05, 2023 | 2:38 PM
25 కోట్ల పుకార్లపై స్పందించిన సమంత.. ఇచ్చి పడేసింది!

స్మైలింగ్‌ క్వీన్‌ సమంత గత కొన్నేళ్లుగా మైయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా పూర్తి స్థాయిలో ఆమె సినిమాలపై దృష్టి పెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలోనే చికిత్స కోసం అమెరికా ప్రయాణం అయ్యారు. దాదాపు ఆరు నెలల పాటు ఆమె అమెరికాలో చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉన్న షూటింగులను పూర్తి చేశారు. కొత్తగా ఏ సినిమాకు కూడా సైన్‌ చేయలేదు. ఓ ఆరు నెలల పాటు ఆమె సినిమాలకు దూరంగా ఉండటం కారణంగా.. దాదాపు 12 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోనుందని టాక్‌.

దానికి తోడు అమెరికాలో అంత కాలం ఉండి చికిత్స తీసుకోవాలి కాబట్టి బానే ఖర్చు అవుతుందని సమాచారం. అయితే, ఈ మొత్తం ట్రీట్‌మెంట్‌ ఎపిసోడ్‌పై మీడియాలో కొత్త పుకార్లు పుట్టుకొచ్చాయి. సమంత చికిత్స కోసం ఏకంగా 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇంత పెద్ద మొత్తాన్ని ఆమె ఓ స్టార్‌ హీరో దగ్గర అప్పుగా తీసుకుంటోందని వార్తలు వచ్చాయి. గత కొద్ది రోజులనుంచి ఈ వార్తలు సోషల్‌ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తలు సమంతకు సైతం చేరాయి.

Samantha react on rumours

తాజాగా, స్టార్‌ హీరో 25 కోట్ల ఆర్థిక సాయం పుకార్లపై సమంత స్పందించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ స్టోరీ పెట్టారు. ఆ స్టోరీలో.. ‘‘ మైయోసైటిస్‌ ట్రీట్‌మెంట్‌ కోసం 25 కోట్లా?.. ఎవరో మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు. నేను అందులో కొంత మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నాను. సినిమాలు చేసి నేను కూడా బానే సంపాదించాను. నా గురించి నేను పట్టించుకోగలను. మైయోసైటిస్‌తో వేల మంది బాధపడుతున్నారు. ట్రీట్‌మెంట్‌ గురించిన వివరాలు చెప్పే ముందు బాధ్యతగా వ్యవహరించండి’’ అంటూ చురకలు అంటించారు. సమంత స్పందనతో పుకార్లకు చెక్‌ పెట్టినట్లు అయింది. మరి, 25 కోట్ల పుకార్లపై సమంత స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet