iDreamPost
android-app
ios-app

వీడియో: చిన్నపిల్లలా మారిన సమంత.. సింగర్‌ పిల్లలతో ఆటలు!

  • Published Aug 07, 2023 | 12:14 PM Updated Updated Aug 07, 2023 | 12:14 PM
  • Published Aug 07, 2023 | 12:14 PMUpdated Aug 07, 2023 | 12:14 PM
వీడియో: చిన్నపిల్లలా మారిన సమంత.. సింగర్‌ పిల్లలతో ఆటలు!

స్మైలింగ్‌ క్వీన్‌ సమంత ప్రస్తుతం రెస్ట్‌ మోడ్‌లో ఉన్నారు. అమెరికాలో మైయోసైటిస్‌ చికిత్స నేపథ్యంలో ఆమె సినిమాలకు పూర్తి స్థాయిలో బ్రేక్‌ ఇచ్చారు. ఫ్రెండ్స్‌తో కలిసి టూర్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. టూర్‌లో లేని సమయాన్ని కూడా ఫెండ్స్‌తో.. వారి కుటుంబాలతో గడుపుతున్నారు. తాజాగా, ఆమె ప్రముఖ సింగర్‌ చిన్మయి, నటుడు రాహూల్‌ రవీంద్రన్‌ల ఇంటికి వెళ్లారు. అక్కడ వారి ఇద్దరు పిల్లలతో సరదాగా గడిపారు. ఆమె ఓ చిన్న పిల్లలా మారిపోయి వారితో ఆడుకున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన  వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, సమంత కొన్ని రోజుల్లో అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడ ఓ ఆరు నెలల పాటు మైయోసైటిస్‌కు చికిత్స తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే సైన్‌ చేసిన అన్ని సినిమా షూటింగులను పూర్తి చేసుకున్నారు. వేరే ఏ కొత్త సినిమాకు కూడా ఆమె సైన్‌ చేయలేదు. ఓ ఆరు నెలల పాటు అక్కడే ఉండి చికిత్స తీసుకోవటానికి భారీగానే ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును భరించటానికి ఆమె ఓ స్టార్‌ హీరో దగ్గర అప్పు చేస్తోందన్న వార్తలు కూడా వచ్చాయి.

ఆ వార్తలపై సమంత తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ స్టోరీ పెట్టారు. అవన్నీ ఒట్టి పుకార్లేనని అన్నారు. తాను బాగా సంపాదించానని, తన ఖర్చు తాను భరించగలనని కూడా చెప్పారు. మైయోసైటిస్‌ చికిత్స గురించి తప్పుడు సమాచారం ఇవ్వవద్దని హితవు పలికారు. ఇక, సమంత నటించిన ఖుషి సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ‘చెన్నై స్టోరీస్‌’ అనే సినిమా.. ‘సిటడెల్‌’ అనే వెబ్‌ సిరీస్‌ కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి, సమంత చిన్న పిల్లలా మారి చిన్మయి పిల్లలతో ఆడుకోవటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş