iDreamPost
android-app
ios-app

Samantha: సమంత పెట్టుకున్న వాచ్‌ ధర తెలిస్తే షాకవుతారు.. లైఫ్‌లో సెటిల్‌ అయిపోవచ్చు!

  • Published Apr 20, 2024 | 2:17 PM Updated Updated Apr 20, 2024 | 2:17 PM

సెలబ్రిటీలు వాడే వస్తువలు అన్ని బ్రాండెడ్‌వే ఉంటాయి. వాటి ధర లక్షలు, కోట్లలో ఉంటుంది. ఇక తాజాగా సమంత ధరించిన వాచ్‌ ఖరీదు కూడా అందరిని షాక్‌కు గురి చేస్తోంది. ఆ వివరాలు.

సెలబ్రిటీలు వాడే వస్తువలు అన్ని బ్రాండెడ్‌వే ఉంటాయి. వాటి ధర లక్షలు, కోట్లలో ఉంటుంది. ఇక తాజాగా సమంత ధరించిన వాచ్‌ ఖరీదు కూడా అందరిని షాక్‌కు గురి చేస్తోంది. ఆ వివరాలు.

  • Published Apr 20, 2024 | 2:17 PMUpdated Apr 20, 2024 | 2:17 PM
Samantha: సమంత పెట్టుకున్న వాచ్‌ ధర తెలిస్తే షాకవుతారు.. లైఫ్‌లో సెటిల్‌ అయిపోవచ్చు!

ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సమంత.. తన అందంతో ప్రేక్షకులను నిజంగానే మాయ చేసింది. ఏళ్ల తరబడి సినిమాలు చేస్తోన్న.. ఆమె అందం, క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. చేతి నిండా సినిమాలతో ఏడాదంతా బిజీగా ఉండే సమంత.. ప్రస్తుతం అనారోగ్యం బారిన పడటంతో.. మూవీలకు దూరంగా ఉంటుంది. లైమ్‌లైట్‌కు దూరమైనా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటుంది సామ్‌. వరుస ఫొటో షూట్లు, వెకేషన్‌ సందర్భంగా తీసిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటుంది సమంత. గ్లామర్‌ ఫొటోషూట్లలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇక లేటెస్ట్‌ ఫొటో షూట్‌కి సంబంధించిన పిక్స్‌ను షేర్‌ చేసింది సమంత. ఈ ఫొటోలు విపరీతంగా వైరల్‌ అవుతుండగా.. దీనిలో సమంత ధరించిన వాచ్‌ ప్రతి ఒక్కరిని ఆక్టుటకుంటుంది. మరి దాని ధర ఎంత వంటి వివరాలు..

సాధారణంగా సెలబ్రిటీలు అంటేనే లగ్జరీ వస్తువులు వాడుతుంటారు. ఇక వార్తలు కూడా ఎప్పుడు హీరోలు వాడే బ్రాండెడ్‌ ఐటమ్స్‌కు సంబంధించినవే వస్తుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం నెటిజనులు సమంత వాచ్‌ చూసి ఫిదా అయ్యారు. దాని కాస్ట్‌ ఎంత అంటూ నెట్‌లో తెగ వెతుకుతున్నారు. ధర తెలుసుకుని కళ్లు తేలేస్తున్నారు. ఇంతకు సామ్‌ పెట్టుకున్న వాచ్‌ రేటు ఎంత.. అది ఏ కంపెనీది.. దాని ప్రత్యేకత ఏంటి అంటే..

తాజా ఫొటో షూట్‌లో సమంత వైట్‌ కలర్‌ మిని డ్రెస్‌లో అదిరే ఫొజులు ఇచ్చింది. అయితే అందరిని ఆకర్షించింది మాత్రం సామ్‌ ధరించిన వాచ్‌. బ్రేస్‌లెట్‌ మోడల్‌లో.. చేతికి చుట్టినట్లు ఉన్న ఈ వాచ్‌పైనే అందరి కళ్లు పడ్డాయి. ఇదేదో నార్మల్‌ వాచ్‌ అనుకుంటే పొరపాటే.. బ్రాండెడ్‌ లగ్జీరీ వాచ్‌. పైగా వజ్రాలు పొదిగారు. వాచ్‌ డయల్‌ చుట్టూ సిల్వర్ ఒపలైన్, డైమండ్లు అతికించారు. ఇక సామ్‌ ధరించిన ఈ గడియారం బల్గారియా సర్పెంటీ వాచ్‌ అని తెలుస్తోంది. ఇక దీని ఖరీదు.. 70 లక్షల రూపాయలు అంట.

ఇక తాజా ఫొటో షూట్‌లో సమంత.. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ గూచీ కి చెందిన వైట్ లక్కర్ జాకెట్‌తో పాటు మినీ స్కర్ట్ ధరించింది. దీనికి మ్యాచింగ్‌గా సర్పెంటీ వాచ్‌ను చేతికి చుట్టుకుంది. దాంతో అందరి దృష్టి ఈ డైమండ్‌ స్టడెడ్‌ వాచ్‌ మీద పడింది.ఇక ఈ వాచ్‌ ఖరీదు 70లక్షలు అని తెలియడంతో.. నెటిజనులు షాకవుతున్నారు. వామ్మో సమంత వాచ్‌ అమ్ముకుంటే.. లైఫ్‌లో సెటిల్‌ కావొచ్చు అని కామెంట్స్‌ చేస్తున్నారు. అయినా ఎప్పుడు హీరోలు వాడే బ్రాండెడ్‌ వస్తువుల గురించే తెలుసుకోవాలా ఏంటి.. వారికి ధీటుగా ఇప్పుడు మా సామ్‌ లక్షల ఖరీదైన వాచ్‌ పెట్టుకుంది అని ఆమె అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదే వాచ్‌ను గతంలో రెండు సందర్భాల్లో ధరించింది సమంత. బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి చేసిన ఫొటోషూట్‌ సందర్భంగా.. మరోసారి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈవెంట్‌ కోసం ఈ వాచ్‌ ధరించింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత నటించిన సిటాడెల్‌ ఇండియన్‌ వర్షన్‌ విడుదల కానుంది. అదలా ఉంచితే.. త్వరలోనే సమంత అల్లు అర్జున్‌-దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss