iDreamPost

Samantha: ఫస్ట్ టైమ్ ఆ స్టార్ హీరోతో సమంత.. మరో సారి ఆ డైరెక్టర్ తో!

  • Published Jun 13, 2024 | 10:43 AMUpdated Jun 13, 2024 | 10:43 AM

సమంత.. టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో అయితే టాలీవుడ్ లో సమంత సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఆమె కాన్సన్ట్రేషన్ అంత హాలీవుడ్, బాలీవుడ్ పైనే ఉన్నట్లు సమాచారం.

సమంత.. టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో అయితే టాలీవుడ్ లో సమంత సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఆమె కాన్సన్ట్రేషన్ అంత హాలీవుడ్, బాలీవుడ్ పైనే ఉన్నట్లు సమాచారం.

  • Published Jun 13, 2024 | 10:43 AMUpdated Jun 13, 2024 | 10:43 AM
Samantha: ఫస్ట్ టైమ్ ఆ స్టార్  హీరోతో సమంత.. మరో సారి ఆ డైరెక్టర్ తో!

టాలీవుడ్ లో సమంతకు మంచి ఫాలోయింగ్ ఏ ఉంది. ఇప్పటివరకు చాలానే సినిమాలతో సమంత తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించి.. తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ ఈ మధ్య కాలంలో సమంత వెండి తెరపైన కనిపించి చాలా కాలమే అయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు నిత్యం.. అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబందించిన అప్ డేట్స్ ను సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంటుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు సమంత కాన్సన్ట్రేషన్ అంతా బాలీవుడ్ , హాలీవుడ్ పైనే ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా సమంత నెక్ట్ ప్రాజెక్టు కు సంబంధించిన విషయాలలో బజ్ నడుస్తుంది.

ప్రస్తుతం మోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రీసెంట్ గా.. మమ్ముట్టి తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో ఓ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇక ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ప్రకారం.. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సమంతను హీరోయిన్ గా.. ఎంపిక చేస్తున్నట్లుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ వార్తలు కానీ నిజం అయితే మాత్రం.. మరోసారి సమంత తెలుగు వెండి తెరపైన కనిపించే అవకాశం ఉంది. సమంత కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం .. గౌతమ్ మీనన్ తో సమంత హ్యాట్రిక్ కొట్టేసినట్లే. ఏ మాయ చేసావే, ఎటు వెళ్ళిపోయింది మనసు సినిమాలలో సమంత నటించింది. ఈ రెండు సినిమాలు కూడా సమంతకు మంచి ఫేమ్ ను తెచ్చిపెట్టాయి . ఒక వేళ ఇపుడు వినిపిస్తున్న టాక్ నిజమైతే కనుక.. ఈ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పి తీరాలి.

Samantha

ఇక మమ్ముట్టి, గౌతమ్ మీనన్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 15 నుంచి స్టార్ట్ అవ్వనుంది. జూన్ 20 న మమ్ముట్టి ఈ సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు. మమ్ముట్టి ప్రొడక్షన్ బ్యానర్.. మమ్ముట్టి కంపెనీ ఈ మూవీని నిర్మించనుంది. ఇక రీసెంట్ గా మమ్ముట్టి టర్బో మూవీతో సక్సెస్ సాధించారు. ఇక దానికంటే ముందు వచ్చిన “భ్రమయుగం ” సినిమా కూడా ఏ రేంజ్ లో హిట్ టాక్ ఉంటూ సంపాదించుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. మరి, సమంత మమ్ముట్టితో కలిసి నటించనుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి