iDreamPost
android-app
ios-app

సమంతను ఇంటర్వ్యూ చేస్తోన్న ఈ యాంకర్ ఎవరో తెలుసా…?

  • Published Aug 20, 2024 | 4:52 PM Updated Updated Aug 20, 2024 | 4:52 PM

టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ఇంటర్వ్యూ చేస్తోన్న ఈ యాంకర్ ఎవరో తెలుసా...? ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్ స్టార్. బుల్లితెర నుండి వెండితెరపైకి ఎదిగిన హీరో.

టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ఇంటర్వ్యూ చేస్తోన్న ఈ యాంకర్ ఎవరో తెలుసా...? ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్ స్టార్. బుల్లితెర నుండి వెండితెరపైకి ఎదిగిన హీరో.

  • Published Aug 20, 2024 | 4:52 PMUpdated Aug 20, 2024 | 4:52 PM
సమంతను ఇంటర్వ్యూ చేస్తోన్న ఈ యాంకర్ ఎవరో తెలుసా…?

ఈ ఫోటోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ఇంటర్వ్యూ చేస్తోన్న యాంకర్‌ను గుర్తుపట్టారా..? బహూశా అప్పుడు ఊహించి ఉండడు తానొక హీరో అవుతానని, అతి తక్కువ సమయంలోనే లేడీ సూపర్ స్టార్ సరసన యాక్ట్ చేస్తానని. కేవలం నాలుగు ఐదు చిత్రాలకే స్టార్ హీరోగా ఎదిగాడు ఈ సీరియల్ యాక్టర్. ఇంతకు ఆ స్టార్ ఎవరంటే కవిన్ రాజ్. స్మాల్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్ పైకి ఎదిగిన మరో యాక్టర్. కవిన్ తెలుగులో సినిమాలు చేయనప్పటికీ..  దాదా, స్టార్ డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్  మూవీ లవర్స్‌ను ఆకర్షించాడు. ఒకప్పుడు విజయ్ టీవీ సీరియల్స్‌లో మెరిసిన ఈ యంగ్ హీరో.. తమిళ బిగ్ బాస్‌లో పాల్గొన్నాక జాతకమే మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక స్టార్ డమ్ స్టార్టయ్యింది. అతడి కెరీర్ ఎత్తుపల్లాలు చూస్తే..

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పుట్టిన కవిన్ రాజ్.. లయోలో కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో స్టార్ విజయ్ ఛానల్లో ఆడిషన్స్‌కు వెళ్లాడు. అక్కడ సెలెక్ట్ కావడంతో కనా కనుమ్ అనే సీరియల్లో వర్క్ చేశాడు. తాయుమానవన్ అనే ధారావాహికలో నటించాడు. కానీ అతడికి గుర్తింపునిచ్చింది మాత్రం శరవణన్ మీనచ్చి. తొలి సీజన్‌లో మురుగన్ పాత్రలో మెప్పించిన అతడు.. సీజన్ 2లో మెయిన్ రోల్ పోషించాడు. 2013 నుండి ప్రసారమైన ఈ ధారా వాహిక 2016 వరకు కొనసాగింది. అంతక ముందు కార్తీక్ సుబ్బరాజు పిజ్జాలో చిన్న రోల్‌లో మెరిసిన.. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్స్‌లో మెరిశాడు. సీరియల్స్ వల్ల తన హీరోగా అవకాశాలు రావట్లేదని భావించిన కవిన్.. ఇక సీరియల్స్ చేయడం ఆపేశాడు. అలా మూడేళ్ల పాటు హోస్టుగా పలు షోస్ చేశాడు. అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది బిగ్ బాస్.

Samantha, Kavin Raj new

2019లో తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో ఇంట్లోకి ఎంటరైన కవిన్.. అనతికాలంలోనే ఆకట్టుకున్నాడు. 94 రోజుల పాటు ఇంట్లో ఉండి… ఐదు లక్షలతో బయటకు వచ్చాడు. అప్పటికే నత్పున ఎన్నను తేరియుమా అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది అంతగా ప్రేక్షకులను ఆకట్టకోలేదు. బిగ్ బాస్‌లో తన ఆట తీరుతో ఆకట్టుకున్న కవిన్.. హౌస్ నుండి బయటకు రాగానే.. హీరోగా అవకాశాలు క్యూ కట్టాయి. అలా లిఫ్ట్ అనే హారర్ మూవీలో నటించాడు. ఇది ఓటీటీలో రిలీజైంది. కానీ కవిన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అతడి కెరీర్ మార్చిన మూవీ దాదా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో స్టార్ హీరోగా మారాడు. ఆ తర్వాత వచ్చిన స్టార్ మూవీ కూడా విమర్శల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను తెలుగు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించడం విశేషం. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఒకటి నయనతారతో యాక్ట్ చేస్తుండగా.. కిస్, మాస్క్, బ్లడీ బెగ్గర్స్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetpasacasinocasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabethızlıcasino girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom