iDreamPost
android-app
ios-app

యూత్‌కు సమంత ఇంపార్‌టెంట్‌ మెసేజ్‌!

యూత్‌కు సమంత ఇంపార్‌టెంట్‌ మెసేజ్‌!

ప్రముఖ తమిళ హీరో విజయ్‌ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్‌ ఆంటోనీ కూతురు మీరా ఆంటోని మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు చెన్నైలోని డీడీకే రోడ్ ఉన్న తమ నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చిన్న వయసులో ఆమె ప్రాణాలు తీసుకోవటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లేనిపోని భయాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తప్పుడు నిర్ణయాలు తీసుకునే యువతకు సమంత ముఖ్యమైన మెసేజ్‌ఇచ్చారు.

మంగళవారం ఆమె తన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే యువత గురించి మాట్లాడుతూ..   ‘‘ మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆపాలనుకుంటున్నాను. కచ్చితంగా చేస్తాను. చాలా మంది యూత్‌ ఓ కష్టం రాగానే ‘ నా జీవితం అయిపోయింది’ అని అంటూ ఉంటారు. నాక్కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుడా! అలాంటివి మీకు జరక్కుండా ఉండాలని కోరుకుంటున్నాను. కష్టసమయంలోనే మీ జీవితం ఆరంభం అవుతుంది.

నేను ఇలా మీ ముందు ఉంటానని, ఇన్ని కష్టనష్టాలను ఎదుర్కొంటానని నేను అనుకోలేదు. నేను గతంలోకంటే శక్తివంతంగా .. సంతోషంగా .. పాజిటివ్‌గా ఉన్నాను. అది పెరుగుతూపోతోంది’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు సమంత జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని ధైర్యం తెచ్చుకోవాలని అంటున్నారు. ప్రతీ సమస్యకు చావు పరిష్కారం కాదని అంటున్నారు. మరి, యువతకు సమంత ఇచ్చిన మెసేజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet