iDreamPost
android-app
ios-app

సమంత ఇచ్చిన గిఫ్ట్‌తో సంబరపడుతున్న స్టైలిస్ట్‌!

  • Published Oct 11, 2023 | 8:50 PM Updated Updated Oct 11, 2023 | 8:50 PM
  • Published Oct 11, 2023 | 8:50 PMUpdated Oct 11, 2023 | 8:50 PM
సమంత ఇచ్చిన గిఫ్ట్‌తో సంబరపడుతున్న స్టైలిస్ట్‌!

అనారోగ్యం కారణంగా సమంత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు ఆమె సినిమా షూటింగ్‌ల నుంచి దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త సినిమాలకు సైన్‌ చేయలేదు. ప్రస్తుతం ఆమె అమెరికాలో మైయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి ఇండియా వచ్చి పోతున్నారు. అయితే, సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా ఆమె కమర్శియల్‌ యాడ్లను మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. కొన్ని నగలు, ఇతర ఫొటో షూట్లలో పాల్గొంటున్నారు.

తాజాగా, ఆమె ఓ జ్యువెలరీ యాడ్‌కు సంబంధించిన ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. పింక్‌ డ్రెస్‌లో తళుక్కున మెరిశారు. ఇక, ఆ డ్రెస్‌ను డిజైన్‌ చేసిన ప్రీతమ్‌కు సమంత అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చింది. అతడికి విలువైన చెవి రింగులు బహుకరించింది. దీంతో అతడు ఎంతో సంబరిపడిపోయాడు. అవి పెట్టుకోవటం కోసం అప్పటికప్పుడు చెవులు కూడా కుట్టించుకున్నాడు. చెవులు కుట్టించుకుంటున్న దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశాడు.

‘‘నేను ఎప్పుడూ అనుకోలేదు నేను చెవులు కుట్టించుకుంటానని. నాకు చెవి రింగులు గిఫ్ట్‌గా ఇచ్చిన సమంత అక్కకు కృతజ్ఞతలు. నన్ను ఎప్పుడూ వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చాడు. ఇక, ప్రతీమ్‌ పెట్టిన పోస్టులనే సమంత కూడా తన ఇన్‌స్టా స్టోరీలుగా పెట్టింది. ఆ పోస్టులు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, సమంత.. ప్రీతమ్‌కు చెవి రింగులు బహుమతిగా ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom