iDreamPost
android-app
ios-app

Samantha: మళ్లీ పెళ్లిపై దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సమంత!

సమంత సినిమాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో.. సోషల్‌ మీడియాకు బాగా దగ్గరయ్యారు. అది కూడా ఫ్యాన్స్‌ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. తనకు సంబంధించిన విషయాలను షేర్‌ చేసుకుంటూ ఉన్నారు.

సమంత సినిమాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో.. సోషల్‌ మీడియాకు బాగా దగ్గరయ్యారు. అది కూడా ఫ్యాన్స్‌ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. తనకు సంబంధించిన విషయాలను షేర్‌ చేసుకుంటూ ఉన్నారు.

Samantha: మళ్లీ పెళ్లిపై దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సమంత!

సమంత ప్రస్తుతం లీవ్‌ మోడ్‌లో ఉన్నారు. సినిమాలకు సెలవు ప్రకటించి చాలా నెలలు అయింది. మైయోసైటిస్‌కు చికిత్స కోసం ఆమె దాదాపు 6 నెలలు మూవీస్‌నుంచి సెలవు తీసుకున్నట్లు సమాచారం. ఆమెరికా వెళ్లిన ఆమె కొన్ని నెలల పాటు చికిత్స చేయించుకున్నారు. కఠినమైన కసరత్తులు, డైట్‌ను ఫాలో అయ్యారు. ఎట్టకేలకు ఆ వ్యాధినుంచి చాలా వరకే బయటపడ్డారు. ఇక, ఆమె సెలవు తీసుకున్న ఆరు నెలలు పూర్తి కావస్తున్నాయి. అయినప్పటికీ ఆమె సినిమాలు చేసే విషయంలో క్లారిటీ లేదు.

సమంత చిత్రాలకు దూరంగా ఉన్నా.. ఫ్యాన్స్‌ కోసం మాత్రం సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటూ ఉన్నారు. తాను చేసిన యాడ్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు కూడా పంచుకుంటున్నారు. సమంత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేస్తున్నారు. లైవ్‌లు నిర్వహిస్తున్నారు. తాజాగా కూడా ఆమె ఫ్యాన్స్‌తో లైవ్‌ నిర్వహించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

samantha shocking comments on her marriage

ఈ సందర్భంగా ఓ ఫ్యాన్‌ రెండో పెళ్లి గురించి ఆమెను ప్రశ్నించాడు. ‘‘ మళ్లీ పెళ్లి చేసుకునే విషయం గురించి మీరు ఆలోచించటం లేదా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు సమంత సమాధానం ఇస్తూ.. ‘‘ స్టాటిస్టిక్స్‌ ప్రకారం అదో చెడ్డ పెట్టుబడి’’ అని పేర్కొన్నారు. విడాకులకు సంబంధించిన కొన్ని లెక్కలను సైతం పోస్టు చేశారు. ఆ పోస్టులో… ‘‘  మొదటి పెళ్లికి సంబంధించి విడాకుల రేటు దాదాపు 50 శాతంగా ఉంది. అదే విధంగా రెండో పెళ్లికి సంబంధించి విడాకుల రేటు 67 శాతంగా ఉంది.

ఇక, మూడో పెళ్లికి సంబంధించి విడాకుల రేటు 73 శాతంగా ఉంది. అది కూడా స్త్రీలు, పురుషుల విషయంలో సమానంగా..’’ అని ఉంది. దీంతో సమంత రెండో పెళ్లి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారని అర్థం అవుతోంది. పెళ్లి గురించి కంటే.. ఆరోగ్యం గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లు తేటతెల్లం అవుతోంది. ఓ ఫ్యాన్‌ ‘మీ రాబోయే సంవత్సరం ప్లాన్‌ ఏంటి?’’ అని అడగ్గా.. ‘‘ మంచి ఆరోగ్యం’’ అని సమంత సమాధానం ఇచ్చింది.

samantha shocking comments on her marriage

కాగా, సమంత చివరగా ‘ఖుషీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్‌ దేవర కొండకు జంటగా నటించారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక, సమంత ‘సిటడెల్‌’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. షూటింగ్‌ పూర్తయినప్పటికి విడుదల తేదీ అయితే ఖరారు కాలేదు. వీటితో పాటు ‘ చెన్నై స్టోరీస్‌’ అనే ఇంగ్లీష్‌ మూవీలో కూడా నటించబోతున్నారు. ఈ చిత్రంతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మరి, సమంత రెండో పెళ్లిపై చేసిన కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetMeritkingTimebetGrandpashabetGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet girişcasibom girişgrandpashabet giriş