iDreamPost
android-app
ios-app

Samantha: బర్త్‌డే రోజున ఫ్యాన్స్‌కు గుడ్‍న్యూస్ చెప్పిన సమంత.. ఒక్క పోస్టర్‌తో అంచనాలు పెంచేసిందిగా

  • Published Apr 28, 2024 | 5:02 PM Updated Updated Apr 28, 2024 | 5:02 PM

బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌ చెప్పింది సమంత. ఒక్క పోస్టర్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకు సమంత చెప్పిన శుభవార్త దేని గురించి అంటే..

బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌ చెప్పింది సమంత. ఒక్క పోస్టర్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకు సమంత చెప్పిన శుభవార్త దేని గురించి అంటే..

  • Published Apr 28, 2024 | 5:02 PMUpdated Apr 28, 2024 | 5:02 PM
Samantha: బర్త్‌డే రోజున ఫ్యాన్స్‌కు గుడ్‍న్యూస్ చెప్పిన సమంత.. ఒక్క పోస్టర్‌తో అంచనాలు పెంచేసిందిగా

ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది సమంత. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అందం, నటనతో ప్రేక్షకులను మాయ చేస్తూనే ఉంది. ఏళ్లు గడుస్తున్నా.. ఆమె గ్లామర్‌ మాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమంత గత కొంత కాలంగా బ్రేక్‌ తీసుకుంటుంది. మయోసైటిస్‌ వ్యాధి బారిన పడ్డ సమంత.. దానికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. తెలుగులో చివరిసారిగా ఖుషి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఏ చిత్రాల్లో నటించలేదు. మూవీలకు దూరంగా ఉన్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంది సమంత. ఫొటో షూట్లు చేస్తూ.. ఫుల్‌ బిజీగా ఉంది. ఇక నేడు సమంత పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె తన ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తను చేయబోయే నెక్స్ట్‌ సినిమాను ప్రకటించింది. నేడు అనగా ఏప్రిల్‌ 28, ఆదివారం తన బర్త్‌డే సందర్భంగా.. తను నటించబోయే తదుపరి సినిమాను అనౌన్స్‌ చేసింది. ‘మా ఇంటి బంగారం’అనే చిత్రంలో నటించబోతున్నట్లుగా ప్రకటించింది సమంత. ఈ మూవీలో తాను బంగారం పాత్ర చేస్తున్నట్టు పేర్కొంది. ఈ సినిమా టైటిల్‍లో బంగారం అని పెద్దగా ఉండగా.. దానిపై ‘మా ఇంటి’ అని చిన్నగా రాసి ఉంది. ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

పోస్టర్‌తో అంచనాలు పెంచేసిన సామ్‌..

ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సామ్‌.. బర్త్‌డే నాడు విడుదల చేసిన సినిమా పోస్టర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ‘మా ఇంటి బంగారం’మూవీ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఈ చిత్రంలో సమంతా కొత్తగా పెళ్లయిన అమ్మాయిగా నటించబోతుందని పోస్టర్‌ చూస్తే అర్థం అవుతుంది. వంట గదిలో సమంత తుపాకీ పట్టుకున్నట్టు ఈ పోస్టర్ ఉంది. ఒంటిపై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. ఈ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మొత్తంగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతోనే ఈ చిత్రం రానుందని అర్థమవుతోంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే.. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌ మాత్రమే కాక.. నిర్మాత కూడా తనే. తన ప్రొడక్షన్ హౌస్ త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత ఈ చిత్రాన్ని నిర్మించనుంది. గతేడాది డిసెంబర్లోనే ఆము ఈ బ్యానర్‌నుస్థాపించింది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్‌ ఎవరనే విషయాన్ని ప్రకటించలేదు. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది అని తెలుస్తోంది. మా ఇంటి బంగారం మూవీకి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

స్టార్ హీరోయిన్‍గా వెలుగొందుతున్న సమయంలోనే మయోసైటిట్ వ్యాధి బారిన పడింది సమంత. రెండేళ్ల నుంచి ఆమె ఈ సమస్యను ఎదుర్కొంటుంది మయోసైటిస్ వచ్చిన తర్వాత కూడా యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాలను చేసింది. గతేడాది సెప్టెంబర్‌ నుంచి సమంత సినిమాలకు దూరంగా ఉంది. ఇక సమంత ప్రధాన పాత్ర పోషించిన సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రావాల్సి ఉంది. ఈ సిరీస్‍లో వరుణ్ ధావన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍ను ప్రైమ్ వీడియో ప్రకటించే అవకాశం ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet