iDreamPost
android-app
ios-app

ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకోనున్న సమంత.. వార్తల్లో నిజమెంత?

సామాజిక కార్యక్రమాల విషయంలో సమంత ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ఆమె ప్రత్యూష సపోర్టు పేరిట ఓ స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేసి పిల్లలకు సాయం చేస్తున్నారు. ఇప్పుడు మరో వార్త వైరల్‌గా మారింది.

సామాజిక కార్యక్రమాల విషయంలో సమంత ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ఆమె ప్రత్యూష సపోర్టు పేరిట ఓ స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేసి పిల్లలకు సాయం చేస్తున్నారు. ఇప్పుడు మరో వార్త వైరల్‌గా మారింది.

ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకోనున్న సమంత.. వార్తల్లో నిజమెంత?

మైయోసైటిస్‌ కారణంగా స్మైలింగ్‌ క్వీన్‌ సమంత సినిమాలను దూరం అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి ఆమె అమెరికాలో ఉండి మైయోసైటిస్‌ కోసం చికిత్స తీసుకుంటున్నారు. కఠిన నియమాలు పాటిస్తున్నారు. ఆహారం విషయంలోనూ చాలా కచ్చితంగా ఉంటున్నారు. మొత్తం ఆమె ఆరు నెలల పాటు సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనుండగా.. ఇప్పటికే నాలుగు నెలలు గడిచాయి. రెండు నెలల తర్వాత ఆమె సినిమా షూటింగుల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పుడు సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాతో పాటు మీడియాలోనూ తెగ చక్కర్లు కొడుతోంది. ఆమె ప్రత్యూష సపోర్టు పేరిట ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్లుగా ఆమె పేద పిల్లలకు సాయం చేస్తున్నారు. చిన్న పిల్లలు, ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్నారులకు చికిత్స అందేలా చూసుకుంటున్నారు. కొన్ని రకాల ప్రాణాపాయ వ్యాధులకు కూడా చికిత్స అందేలా చేస్తున్నారు. పిల్లల కోసమే కాదు.. మహిళలు, బాలికల కోసం కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇక, అసలు విషయానికి వస్తే.. ఇలా పిల్లలు, మహిళల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమంత.. ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం తీసుకోబోతున్నారట. ఓ ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకోనున్నారట.  ఇక, వారి ఆలనా పాలనా మొత్తం సమంతే చూసుకోనున్నారట. అయితే, ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలీదు. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే.. సమంత కానీ, సమంత టీం కానీ స్పందించాలి. వారినుంచి ఓ అధికారిక ప్రకటన రావాల్సిందే.

కాగా, సమంత 2010లో వచ్చిన ‘ ఏ మాయ చేశావే’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. ఈ రెండు భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆమె పని చేశారు. 2023లో ఖుషీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సమంత ప్రస్తుతం ‘‘ చెన్నై స్టోరీస్‌ ’’ అనే ఇంగ్లీష్‌ మూవీలో నటిస్తున్నారు.

ఈ సినిమాతోటే ఆమె హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 6 నెలల రెస్ట్‌ అయిపోగానే ఆమె మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొంటారు. కొత్త చిత్రాలకు సైన్‌ చేస్తారు. ఇప్పుడు సినిమాలు చేయకపోయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఎప్పటి కప్పడు తనకు సంబంధించిన వివరాలను అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఉన్నారు. మరి, సమంత ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకోబోతున్నారన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/