iDreamPost
android-app
ios-app

సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?

  • Published Sep 21, 2023 | 9:43 PM Updated Updated Sep 21, 2023 | 9:43 PM
  • Published Sep 21, 2023 | 9:43 PMUpdated Sep 21, 2023 | 9:43 PM
సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?

స్మైలింగ్‌ క్వీన్‌ సమంత గత కొన్నేళ్లుగా మైయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా గతంలో ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరిగా నడవలేని పరిస్థితుల్లో కొన్ని నెలల పాటు సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చారు. వైద్యం తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది. తర్వాత సినిమా షూటింగ్‌లు కంటిన్యూ చేశారు. మైయోసైటిస్‌ చికిత్స కోసం నెల క్రితం ఆమె షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చారు. దాదాపు 6 నెలల పాటు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని డిసైడ్‌ అయ్యారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటూ మైయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటున్నారు. సినిమాలకు దూరం అయినా..

ఫ్యాన్స్‌తో మాత్రం తన బంధాన్ని దూరం పెట్టలేదు. కేవలం ఫ్యాన్స్‌ కోసం సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను షేర్‌ చేసుకుంటూ ఉన్నారు. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన ఫ్యాన్స్‌తో లైవ్‌ నిర్వహించారు. ఈ లైవ్‌లో ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ ఫ్యాన్‌ ‘‘ మీ చర్మం ఎలా అంత క్లియర్‌గా ఉంది’’ అని అడిగాడు. ఇందుకు సమంత ఎలాంటి దాపరికాలు లేకుండా సమాధానం ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ..

‘‘ నిజానికి నా చర్మం అలా లేదు. అది కేవలం ఫిల్టర్‌ మాత్రమే.. చిన్మయి శ్రీపాద ఆ సమస్యను పరిస్కరిస్తానని మాటిచ్చింది. నా చర్మాన్ని అందంగా తయారు చేస్తానంది. ఎక్కువగా స్టెరాయిడ్స్‌ షాట్స్‌ తీసుకోవటం ఇబ్బందిగా మారుతోంది. నా చర్మంపై పిగ్మెంటేషన్‌ వస్తోంది’’ అని చెప్పుకొచ్చింది. సమంత ఇలా ఉన్న విషయాన్ని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పటంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సమంత గ్రేట్‌ అంటున్నారు. మరి, సమంత తన చర్మం గురించి ఎలాంటి దాపరికాలు లేకుండా అసలు విషయం చెప్పటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio