iDreamPost
android-app
ios-app

సమంత ప్రతీ రోజూ ఈ పని కచ్చితంగా చేస్తుందట!

సమంత ప్రతీ రోజూ ఈ పని కచ్చితంగా చేస్తుందట!

సమంత ప్రస్తుతం మైయోసైటిస్‌ చికిత్స కోసం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. చికిత్స కోసం ఆమె దాదాపు ఆరు నెలల పాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. అయితే, సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా.. ఫ్యాన్స్‌ కోసం సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. తనకు సంబంధించిన అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు అందిస్తున్నారు. తరుచుగా ఫ్యాన్స్‌తో క్వశ్చన్స్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ నిర్వహిస్తూ ఉన్నారు. ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉన్నారు.

తాజాగా, ఓ ఫ్యాన్‌ ఆమెను ఆయిల్‌ పుల్లింగ్‌ గురించి అడిగాడు. పూర్తిగా వివరించి చెప్పమన్నాడు. దీంతో సమంత ‘‘ కొన్ని విషయాలు నా నిత్య జీవితంలో ఓ భాగం అయిపోయాయి. చూడ్డానికి అంతగా అనిపించకపోవచ్చు.. కానీ, బాగా పనిచేస్తాయి. ప్రతీ రోజూ ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తాను. ఆరోగ్యంగా ఉండటం కోసం అది చాలా అవసరం. రోగాలు ఇతర కారణాల వల్ల ఒంట్లో తయారయ్యే టాక్సిన్స్‌ను అది బయటకు పంపుతుంది. నోటి సమస్యలకు చెక్‌ పెడుతుంది. పళ్లు, చిగుళ్ల సమస్యలను దూరం చేస్తుంది.

ధీర్ఘకాలిక సైనసైటిస్‌, జీర్ణ సంబంధ సమస్యల్ని పరిష్కరిస్తుంది. వాతావరణ కాలుష్యం వల్ల ఒంట్లో చేరే టాక్సిన్స్‌ను శుభ్రం చేస్తుంది. అన్ని రకాల అలసటలను తగ్గిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. తర్వాత దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో స్టోరీగా పెట్టారు. ఆ పోస్టు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సమంత స్టోరీ చదువుతున్న నెటిజన్లు.. ఆయిల్‌ పుల్లింగ్‌ చేయటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఆయిల్‌ పుల్లింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis