iDreamPost
android-app
ios-app

శ్రీవిష్ణుకి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్! ఈ మూవీ తనకు ఎలా వచ్చిందో తెలుసా?

  • Author ajaykrishna Published - 03:06 PM, Sat - 8 July 23
  • Author ajaykrishna Published - 03:06 PM, Sat - 8 July 23
శ్రీవిష్ణుకి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్! ఈ మూవీ తనకు ఎలా వచ్చిందో తెలుసా?

టాలీవుడ్ లో చాలా కాలంగా హిట్ కోసం ట్రై చేస్తున్న హీరోలలో శ్రీవిష్ణు ఒకరు. 2019లో బ్రోచేవారెవరురా మూవీ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టలేకపోయాడు. వరుస ప్లాపుల నుండి ఎలాగైనా బయట పడాలని ఈసారి తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్ లో ‘సామజవరగమన’ అనే మూవీ చేశాడు. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. మొదటి వారంలో ఏకంగా రూ. 30 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. శ్రీవిష్ణు కెరీర్ లోనే సామజవరగమన మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు.

ఇప్పుడీ సినిమాతో శ్రీవిష్ణు కెరీర్ పరంగా హిట్ ట్రాక్ లో పడ్డట్లే. ఇప్పటికే ఈ సినిమా చూసిన టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, రవితేజ ఇతర ప్రముఖులు.. సినిమా చాలా బాగుందని అభినందిస్తూ.. సోషల్ మీడియాలో వారి రివ్యూలు పోస్ట్ చేశారు. దీంతో సినిమాకి మరింత హైప్, క్రేజ్ దక్కింది. వెరసి.. వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది సామజవరగమన చిత్రం. కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత శ్రీవిష్ణుకి ఇది కంబ్యాక్ మూవీ అయ్యిందని చెప్పాలి. క్లాస్​ స్టోరీతో పాటు మంచి కామెడీ ఎలిమెంట్స్​ వర్కౌట్ అవ్వడంతో ఈ సినిమా వైపు ఫ్యామిలీ ఆడియెన్స్​ సైతం క్యూ కడుతున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఈ సినిమా డైరెక్టర్ రామ్ అబ్బరాజు గతంలో వివాహభోజనంబు అనే మూవీ తీశాడు. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ హీరో సందీప్ కిషన్. అయితే.. ఈ సినిమా కథను ముందు సందీప్ కోసమే రెడీ చేసాడట రామ్. కానీ.. అప్పటికే సందీప్ మైఖేల్ మూవీతో బిజీ అయ్యేసరికి ఈ సినిమా శ్రీవిష్ణుని చేరిందని సమాచారం. మరి ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథలు.. వేరే హీరోతో తెరపైకి రావడం చూస్తూనే ఉంటాం. కాకపోతే కొంతమంది కథ విని రిజెక్ట్ చేస్తారు.. మరికొన్ని కాల్ షీట్స్ కుదరక వేరే హీరోలకు వెళ్తుంటాయి. కానీ సామజవరగమన హీరో బిజీగా ఉండటంతో శ్రీవిష్ణుని చేరింది. సో.. ఈ సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో సందీప్ కిషన్ అన్నమాట. మరి ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom